కాకినాడలో ఈనెల 24వ తేదీన జిల్లా ఉపాధి కార్యాలయం నందు జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుందని జిల్లా ఉపాధి అధికారి జి శ్రీనివాసరావు తెలిపారు. ప్రముఖ ప్రైవేటు కంపెనీల్లో పనిచేయడానికి 24వ తేదీన ఉదయం 10:30 గం నుండి జిల్లా ఉపాధి కార్యాలయం నందు ఇంటర్వ్యూలు నిర్వహించడం జరుగుతుందన్నారు.పదవ తరగతి, ఇంటర్, డిగ్రీ, బీఎస్సీ కెమిస్ట్రీ, ఫిషరీస్ విద్యార్హత కలిగి ఆసక్తి గల అభ్యర్థులు తమ సర్టిఫికెట్లు,బయోడేటా జిరాక్స్ కాపీలతో హాజరుకావాలన్నారు. ఇతర వివరాల కొరకు 8639846568 నెంబర్ ను సంప్రదించాలన్నారు.








