Search
Close this search box.

  వెల్దుర్తి లో ఆయిల్ పామ్ రైతులకు అవగాహన సదస్సు

February 21, 2026 7:50 PM | Aditya369 News

వెల్దుర్తి లో ఆయిల్ పామ్ రైతులకు అవగాహన సదస్సు

పిఠాపురంమండలంలోని వెల్దుర్తి గ్రామంలో ఆయిల్ పామ్ తోటల పెంపకంపై పతంజలి ఫుడ్స్ లిమిటెడ్ సినియర్ మేనేజర్ బి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు.తోటల సాగు పద్ధతులు,సస్యరక్షణ,తెగుళ్లు–చీడపీడల నియంత్రణ, అంతర పంటల సాగుపై రైతులకు సాంకేతిక సూచనలు అందించారు. ఉద్యాన శాఖ అధికారి వై సోమరాజశేఖర్ ప్రభుత్వ పథకాలు,రాయితీలు ప్రోత్సాహకాలపై రైతులకు వివరించారు.ఆయిల్ పామ్ తోటల సాగు ద్వారా రైతులు స్థిరమైన అదనపు ఆదాయం పొందవచ్చని తెలిపారు.ఈ అవగాహన సదస్సులో క్లస్టర్ ఆఫీసర్ కామేశ్వర్,టెక్నికల్ ఫీల్డ్ ఆఫీసర్ నూకరాజు, ఎన్. వెంకటేశ్వరరావు,మురళీపతంజలి ఫుడ్స్,ఉద్యాన శాఖ సిబ్బంది,రైతులు పాల్గొన్నారు.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు