కాకినాడ జిల్లా కరప ఓ మానసిక వికలాంగురాలిపై అత్యాచారం కేసులో నిందితుడికి 10 ఏళ్ళు జైలు శిక్ష ఖరారు చేస్తూ రాజమహేంద్రవరంలోని 8వ అదనపు జిల్లా కోర్టు జడ్జి బెన్నయ్యనాయుడు తీర్పునిచ్చారు. వివరాలను కాకినాడ ఎస్పీ బిందుమాధవ్ తెలిపారు. మందాడి అమ్మాజీ అనే మహిళ, గంగాభవానీ(27) అనే మానసిక వికలాంగురాలకి సంరక్షణ చేసేది. ఈనేపథ్యంలో అమ్మాజీ భర్త శ్రీనివాస్ అమ్మాజీ ఇంట్లోలేని సమయం చూసి మానసిక వికలాంగురాలైన గంగాభవానీపై అత్యాచారం చేశాడు. ఈఘటనపై, 03 ఏప్రియల్ 2025న కరప పోలీసులు అత్యాచారం కేసు నమోదు చేశారు. స్పీడ్ ట్రయల్ కోర్టులో విచారణ జరగడంతో 10 ఏళ్ళ శిక్షతోపాటు, 5 వేల రూపాయాలు జరిమానా విధించారు. జరిమానా కట్టని పక్షంలో మరో రెండేళ్ల పాటు శిక్ష భరించాల్సి ఉంటుందని తీర్పులో పేర్కొన్నారు.









