ఫిబ్రవరి 22వ తేదీన పెద్దాపురం పట్టణంలో నియోజకవర్గ పరిధిలో జరుగుతున్నటువంటి జరిగే పిల్లల పండుగను విజయవంతం చేయాలని పిల్లల పండుగ ఆహ్వాన సంఘం ప్రధాన కార్యదర్శి బుద్ధ శ్రీనివాస్ ఈ కార్యక్రమం వివరాలను తెలిపారు.పిల్లల పండుగ జరిగే లూధరన్ ఉన్నత పాఠశాలలో ఆయన మాట్లాడారు. 18 విభాగాలో 2500 మంది విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొంటున్నారని తెలిపారు. ఇప్పటికే అన్ని పాఠశాల ల్లోనూ పోటీలకు సంబంధించినటువంటి అర్హతలు పూర్తయ్యాయని తెలిపారు. పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప, కాకినాడ ఎంపీ తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ హాజరవుతారని చెప్పారు. ఈ సమా వేశంలో కోశాధికారి ప్రభాకర్, వివిఆర్ సీతారామారావు, నెక్కల అనూష, మన పెద్దాపురం నరేష్, రాజేష్ కుమార్ దేవత, ఆహ్వాన సంఘం కమిటీ సభ్యులు గడిగడ్డ సత్తిబాబు, వడ్డీ సత్యనారాయణ, ఎస్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.









