రాష్ట్రవ్యాప్తంగా సహకార సంఘం ఉద్యోగ సమ్మెలో భాగంగా 16వ తేది నుండి తలపెట్టిన సమ్మె 5వ రోజు కార్యక్రమంలో పెద్దాపురంలో ఆ శాఖ ఉద్యోగులు వినూత్న నిరసన చేశారు. తమ కోర్కెలు సాధన కోసం మహాత్మా గాంధీ విగ్రహానికి వినతిపత్రం సమర్పించి నిరసన తెలిపారు. పెద్దాపురం బ్రాంచ్ డైరెక్టర్ గుణ్ణం వీర వెంకట సత్యనారాయణ ఆర్బి పట్నం, సీఈవో నల్లల వీర వెంకట సత్యనారాయణ, కట్టమూరు సీఈవో సానపల్లి నాగభూషణం, కాంట్రాకోట సీఈవో సానిడు అర్జునుడు, వీరవరం సీఈవో బొడ్డు శ్రీనివాసరావు, సంఘ సిబ్బంది అప్పాజీ, గోపి,తాతాజీ, రాంపవన్, పివి రమణ, గుమ్మడి బాబి,రాంబాబు,నాని లు పాల్గొన్నారు.









