తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ జిల్లా లక్ష్మీదేవిపల్లి గ్రామానికి చెందిన తాండ్ర అంజయ్య బహ్రెయిన్ దేశంలో ఉపాధి నిమిత్తం పనిచేస్తూ, దురదృష్టవశాత్తూ మరణించాడు. ఈ విషయమై ఆయన అల్లుడు సురేష్ ఫోన్ ద్వారా కోనసీమ సెంటర్ ఫర్ మైగ్రేషన్‌కు తెలిపారు. వారు కోనసీమ కలెక్టర్ మహేష్ కుమార్ దృష్టికి విషయాన్ని తీసుకెళ్లారు. ఇండియన్ ఎంబసీ ద్వారా బహ్రెయిన్‌లో తెలుగు ప్రతినిదుల సహకారంతో, మృతదేహాన్ని మృతుడు ప్రస్తుత నివాసమైన హైదరాబాద్‌కు చేరుకుంది. మృతదేహం భారతదేశానికి సురక్షితంగా రప్పించేందుకు కోనసీమ సెంటర్ ఫర్ మైగ్రేషన్ సహాయ సహకారాలు అందించినట్లు నోడల్ అధికారి శ్రీమతి కె. మాధవి, సమన్వయ అధికారి గోళ్ళ రమేష్ తెలిపారు.









