తిరుమల లడ్డూపై దుష్ప్రచారం చేస్తూ కూటమి నేతలు మహాపాపం చేస్తున్నారని కాకినాడ ఎంపీ వంగా గీత తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. పిఠాపురంలోని వైసీపీ కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆమె కూటమి నేతల తీరుపై మండిపడ్డారు. మహాశివరాత్రి సందర్భంగా పిఠాపురం పాదగయ క్షేత్రం వద్ద తిరుమల లడ్డూను అపవిత్రం చేసేలా పాంప్లెట్స్ పంచడంపై తీవ్ర ఆవేదన వ్యక్తపరిచారు. ఈ విషయంలో కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ పాంప్లెట్స్ పంచే విషయాన్ని గమనించు కోవాలన్నారు. ఇలా చేయడం చాలా దారుణమన్నారు. జగన్పై కక్షతో తిరుమల లడ్డూను అపవిత్రం చేసేలా వ్యవహరించడం ఎంత మాత్రం సరికాదన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు అవుతున్నా, ఇంకా మత రాజకీయాలతో పబ్బం గడపడాన్ని ప్రజలు గమనిస్తున్నారన్నారు.









