తాజాగా పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ, ఆరోగ్యశ్రీ బిల్లుల విషయంలో మెడికొవర్ ఆసుపత్రి తీరుపై సమగ్ర విచారణ చేయాలని నేరుగా చంద్రబాబును కలిసి మరోసారి ఫిర్యాదు చేశారు. ఆరోగ్యశ్రీ పేరుతో పేదలను ప్రైవేటు ఆసుపత్రులు దోచుకుంటున్న తీరును వర్మ చంద్రబాబుకు తెలిపారు. ఈమేరకు ఆధారాలను సీఎంకు ఇచ్చారు. కొద్ది రోజుల కిందట ఇదే అంశంపై వర్మ, సీఎంకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.









