పిఠాపురం పుణ్యక్షేత్రం పాదగయలో శివరాత్రి మహోత్సవాలను పురస్కరించుకుని కుక్కుటేశ్వరస్వామి రథోత్సవం కన్నుల పండువగా జరిగింది.రథోత్సవం పట్టణంలోని ఉప్పాడ బస్టాండు వరకూ చేరుకుంది. పలు సాంస్కృతిక కార్యక్రమాలతో స్వామివారిని ఊరేగింపుగా రథంపై తీసుకెళ్లడం, భక్తులు స్వామి వారి రథోత్సవంలో వేల సంఖ్యలో కూడా రావడంతో పట్టణంలో సందడి వాతావరణం నెలకొంది.బాణాసంచా కాల్పులు అంబరాన్నంటాయి. మిరుమిట్లుగొలిపే విద్యుత్ దీపాలంకరణతో రథం మెరిసింది.










