రామచంద్రపురం నియోజవర్గం కాజులూరు మండలంలో రూ.2 కోట్లు 40 లక్షల వ్యయంతో నిర్మించనున్న పలు రహదారి అభివృద్ధి పనులకు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ శంకుస్థాపన చేశారు.మండలంలోని ఉండూరు బ్రిడ్జి నుంచి పటవల వరకు రహదారి నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు.అలాగే గొల్లపాలెం నుంచి కుయ్యేరు (చేదువాడ బ్రిడ్జి అప్రోచ్ రోడ్డు) వరకు నిర్మించనున్న రహదారి పనులను ప్రారంభించారు.ఈ సందర్భంగా మంత్రి వాసంశెట్టి సుభాష్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి రహదారుల నిర్మాణం కీలకమని, మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించడం ద్వారా ప్రజల జీవన ప్రమాణాలు పెరుగుతాయని తెలిపారు. కూటమి ప్రభుత్వం గ్రామీణ మౌలిక వసతుల అభివృద్ధికి పెద్దపీట వేస్తోందని పేర్కొన్నారు.









