కరప మండలంలో నీలయ్య తోటలోని అంగన్వాడి కేంద్రాన్ని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ పరిశీలించారు.ఈ సందర్భంగా ఆయన పిల్లలతో ముచ్చటించారు.పిల్లలు నేర్చుకున్న అంశాలను ఆయన అడిగి తెలుసుకున్నారు.వారు చెప్పిన సమాధానాలను ఎమ్మెల్యే చప్పట్లు కొడుతూ ప్రోత్సాహించి,సంతృప్తి వ్యక్తం చేశారు.ఆయన మాట్లాడుతూ నియోజకవర్గ పరిధిలోని ప్రతి అంగన్వాడీ భవనానికి చుట్టూ ప్రహరి గోడ నిర్మించి, అవసరమైన మౌలిక వసతులు కల్పిస్తామని హామీ ఇచ్చారు. స్థానికులు పలు సమస్యలు ఆయన దృష్టికి తీసుకుని వచ్చారు.ఏ ఎం సి చైర్మన్ ముద్రగడ రమేష్,యండమూరి సర్పంచ్ మారేళ్ళ శివ,యాళ్ల వీరవెంకట సత్యనారాయణ,మెండు గోవింద్,డిప్యూటీ ఎంపిడిఒ ఎస్ శ్రీనివాసరావు, పంచాయతీ కార్యదర్శి శివ రామ కృష్ణ,గోన అంజి,వాసంశెట్టి మహేష్,చిన్నారి శ్రీను,గంటా నానిబాబు తదితరులు పాల్గొన్నారు.









