ఎలక్ట్రికల్ మోటార్ సైకిల్ రంగంలో పేరుగాంచిన ఓలా ఇప్పుడు గోల పెట్టిస్తోంది. మొదట్లో బాగానే ఉన్న ఓలా సర్వీసింగ్, ఇప్పుడు కనిపించడం లేదని బాధితులు వాపోతున్నారు. ఓలా ఎలక్ట్రికల్ వెహికల్ కు సమస్య వస్తే ఎక్కడికి వెళ్లాలో తెలియక తికమకపడుతున్నారు. రోడ్లపై భారీగా తిరుగుతున్న ఓలాకు ఇప్పుడు ఏమైందని ప్రశ్నిస్తున్నారు. మరోపక్క కంపెనీ సర్వీసింగ్ పాయింట్ లు పూర్తిగా అందుబాటులో లేకపోవడంతో బయట మెకానికర్లను ఆశ్రయించాల్సి వస్తుందని అంటున్నారు.








