Search
Close this search box.

  విద్యార్థిని ఆత్మహత్యపై సమగ్ర విచారణ చేయాలి… ఎస్ఎఫ్ఐ

February 15, 2026 10:41 PM | Aditya369 News

విద్యార్థిని ఆత్మహత్యపై సమగ్ర విచారణ చేయాలి… ఎస్ఎఫ్ఐ

కాకినాడ జేఎన్టీయూకె లోని అమ్మాయిల హాస్టల్‌లో కెమికల్ ఇంజనీరింగ్ విద్యార్థిని ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన పై సమగ్ర విచారణ చేయాలని ఎస్ ఎఫ్ ఐ నాయకులు డిమాండ్ చేశారు.ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా నాయకులు సాహిత్, సత్యం,వాసు సంఘటన చోటుకు వెళ్ళి వివరాలు అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ ఘటనపై పూర్తి స్థాయి, పారదర్శకమైన విచారణ జరపాలనన్నారు.ఆత్మహత్యకు దారితీసిన కారణాలను వెలికితీసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.అదేవిధంగా యూనివర్సిటీ వైస్ చాన్సలర్ సిఎస్ఆర్కె ప్రసాద్ ను కలిసి హాస్టల్‌లో అవసరమైన మౌలిక సదుపాయాలను మెరుగుపరచాలని, విద్యార్థినుల భద్రత దృష్ట్యా రెసిడెన్షియల్ వార్డెన్లను తక్షణమే నియమించాలని కోరారు.భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలన్నారు.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore