కాకినాడ జేఎన్టీయూకే క్యాంపస్ పరిధిలోని లేడీస్ హాస్టల్ లో ఓ విద్యార్థిని సీలింగ్ ఫ్యాన్‌కు ఉరి వేసుకుని మృతి చెందిదని సర్పవరం పోలీసులు తెలిపారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం పాలసింగి గ్రామానికి చెందిన అరుణ కెమికల్ ఇంజనీరింగ్ ద్వితీయ సంవత్సరం చదువుతోంది.విద్యార్థిని మృతి పై తల్లిదండ్రులకు సమాచారం అందజేశారు.సదరు ఘటన పై సర్పవరం పోలీసులు కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.









