రాష్ట్రంలో పేరుగాంచిన శైవక్షేత్రాల్లో ఒకటై, దక్షిణ కాశీగా వీరాజిల్లుతున్న పుణ్యక్షేత్రం పిఠాపురం పాద గయలో శివరాత్రి మహోత్సవాలు అంబరాన్నంటుతున్నాయి. ఎక్కడికక్కడ విద్యుత్ దీపాలంక రణలతోపాటు, పుష్పాలంకరణల నడుమ కుక్కుటేశుడు శోభాయుతమై దర్శనమిస్తున్నాడు. పుణ్య స్నానాల కోసం పుష్కరిణి సిద్ధమైంది. ఎక్కడిక్కడ క్యూలైన్లు, భక్తులకు సకల ఏర్పాట్లు చేశారు . మొత్తంగా మూడు రోజులపాటు జరిగే వేడుకలకు భక్తులు పరమశివుడి ప్రసన్నం కోసం సిద్ధమైయ్యారు. ఇక ఆశివుడి కటాక్షం అందరికీ కలగాలని కోరుకుంద్దాం.












