ఏపీ ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల హాల్ టికెట్లను నేడు విడుదల చేశారు. విద్యార్థులు https://bie.ap.gov.in వెబ్సైట్ ద్వారా నేరుగా పొందవచ్చు. మొదటి సంవత్సరం వారు పదో తరగతి హాల్ టికెట్ నంబరు, ద్వితీయ సంవత్సరం వారు మొదటి సంవత్సరం హాల్ టికెట్ నంబరు లేదా ఆధార్ నంబరు,పుట్టిన తేదీ వివరాలు నమోదుచేసి హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు.మనమిత్ర వాట్సప్ నంబరు 955230 0009కు హాయ్ అని మెసేజ్ పెట్టి, హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవాలని పేర్కొన్నారు. హాల్ టికెట్లపై కళాశాల ప్రిన్సిపల్, కళాశాల స్టాంప్ అవసరం లేదని అధికారులు తెలిపారు.









