పవన్ కల్యాణ్ అభిమానులు సోషల్ మీడియా వేదికగా ‘ఉస్తాద్ భగత్ సింగ్’ అప్‌డేట్స్ ఎప్పుడంటూ హరీశ్ శంకర్‌పై ఒత్తిడి తెస్తున్న నేపథ్యంలో, ఆయన సానుకూలంగా స్పందించారు. అభిమానుల ఆత్రుతను తాను అర్థం చేసుకోగలనని, ప్రతి అప్‌డేట్‌కు ఒక సరైన సమయం ఉంటుందని ఆయన వివరించారు. “మమ్మల్ని నమ్మండి.. సెలబ్రేషన్స్ లోడింగ్.. త్వరలోనే అదిరిపోయే అప్‌డేట్స్ ఇస్తాం” అని అభిమానులకు హామీ ఇచ్చారు. ఈ సినిమా వెనుక చిత్ర యూనిట్ పడుతున్న కష్టాన్ని గుర్తించాలని ఆయన కోరారు.
ముఖ్య విశేషాలు:
-
రిలీజ్ డేట్: ఈ చిత్రాన్ని మార్చి 26, 2026న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి మైత్రీ మూవీ మేకర్స్ సర్వం సిద్ధం చేస్తున్నారు.
-
రెండో పాట ‘ఆరా ఆఫ్ ఉస్తాద్’: దేవి శ్రీ ప్రసాద్ (DSP) అందించిన రెండో పాట రికార్డింగ్ పూర్తయిందని, ఇది ఒక ‘అగ్నిపర్వతం’ లాంటి మాస్ నంబర్ అని హరీశ్ శంకర్ అభివర్ణించారు. చంద్రబోస్ రాసిన సాహిత్యానికి పవన్ ఎనర్జీ తోడైతే థియేటర్లలో పూనకాలేనని ధీమా వ్యక్తం చేశారు.
-
డబ్బింగ్ పనులు: ఇప్పటికే సినిమా డబ్బింగ్ పనులు వేగంగా జరుగుతున్నాయి. హీరోయిన్ రాశీ ఖన్నా తన పాత్రకు డబ్బింగ్ చెప్పడం ప్రారంభించగా, విలన్ పాత్ర పోషిస్తున్న తమిళ నటుడు పార్తీబన్ (నల్లా నాగప్ప) కూడా తన డబ్బింగ్ పూర్తి చేసినట్లు సమాచారం.
-
యాక్షన్ ఎపిసోడ్స్: గబ్బర్ సింగ్ మ్యాజిక్‌ను మించేలా పవన్ కల్యాణ్ కోసం పవర్‌ఫుల్ పోలీస్ క్యారెక్టర్‌ను హరీశ్ శంకర్ డిజైన్ చేశారు. ముఖ్యంగా ఈ సినిమా క్లైమాక్స్ యాక్షన్ ఎపిసోడ్స్ సినిమాకే హైలైట్ కానున్నాయి.








