విశాఖపట్నం నుంచి చెన్నైకి త్వరలో లగ్జరీ క్రూయిజ్ షిప్ సేవలు పునఃప్రారంభం కానున్నాయి.ప్రముఖ నౌకాయన సంస్థ ‘కార్డిలియా క్రూయిజ్’కు చెందిన 11 అంతస్తుల ఎంవీ ఎంప్రెస్ నౌక జూన్ 24 నుంచి జులై 15 మధ్య నాలుగు విడతలుగా సేవలందించనుంది.పుదుచ్చేరి మీదుగా సాగే ఈ విహారయాత్రలో విలాసవంతమైన వసతులతో పాటు వినోద కార్యక్రమాలు ప్రయాణికులకు అందుబాటులో ఉండనున్నాయి. ఇప్పటికే పోర్ట్ అధికారులు చర్చలు పూర్తి చేయడంతో,పర్యాటకులు త్వరలోనే ఆన్లైన్లో టికెట్లు బుక్ చేసుకోవచ్చు.








