సామర్లకోటలో సినీ బృందం సోమవారం సందడి చేసింది.పలు ప్రాంతాల్లో సినిమాకు సంబంధించి సన్నివేశాల చిత్రీకరణ చేపట్టారు.ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు స్టేషన్ సెంటర్లోనూ ఇస్మాయిల్ నగర్ లోని పశువుల ఆసుపత్రి ఎదురుగా దుకాణాల వద్ద సినీ నటుడు ఆలీ కి సంబంధించిన పలు సన్నివేశాలు చిత్రీకరించారు. సాయంత్రం పెద్దాపురం రోడ్డులోని రైస్ మిల్లులో,రాత్రి మఠం సెంటర్ లో సన్నివేశాలు చిత్రీకరించారు.మూడు రోజుల పాటు జరిగే షూటింగ్ నందు పలువురు తారలు పాల్గొంటారని షూటింగ్ వర్గాలు పేర్కొన్నాయి.తొలిరోజు షూటింగ్ నందు ఆలీ, రాజశేఖర్ జీవిత దంపతుల కుమార్తె చిత్రీకరణలో పాల్గొన్నారు.









