పర్యాటక రంగ అభివృద్ధి,రాష్ట్రాలకు అందిస్తున్న నిధులపై సోమవారం కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి లిఖిత పూర్వ సమాధానం ఇచ్చినట్లు ఎంపీ తెలిపారు.దేశంలో పలు రాష్ట్రాల్లో బీచ్,తీర ప్రాంత పర్యాటక స్థలాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం స్వదేశీ దర్శన్,ప్రసాద్,ఎస్ఏఎస్సిఐ,సిబిడిడి వంటి పథకాల ద్వార ఆర్థిక సహాయం అందిస్తోందని ఏపీకి సంబంధించి స్వదేశీ దర్శన్ 1.0 పథకం ద్వార కాకినాడ హోప్ ఐలాండ్,కోరింగ,కోటిపల్లి సర్క్యూట్ కు రూ 67.83 కోట్లు మంజూరు చేయగా 100శాతం నిధులు వినియోగం జరిగి,ప్రాజెక్టులు అమల్లోకి వచ్చాయన్నారు.అలాగే స్వదేశీ దర్శన్ 2.0 పథకం ద్వార సూర్యలంక బీచ్ ప్రాజెక్టుకు రూ.97.52 కోట్లు అలాగే గడిచిన ఏడాదిలో ఏపీ ప్రభుత్వం పర్యాటకరంగ అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలతో విదేశీ పర్యటకుల తాకిడి గణనీయంగా పెరిగిందన్నారన్నారు.2024 నుండి ఇప్పటివరకు ఏపీలో 2,62,431మంది విదేశీయులు పర్యటించగా,తీర ప్రాంత రాష్ట్రాల్లో ఏపీ వాటా 1.25 శాతం గా ఉందని, భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ లో టూరిజం అభివృద్ధికి కేంద్రం అన్ని విధాల సహకరిస్తుందని కేంద్ర మంత్రి వివరించినట్లు ఎంపీ తెలిపారు.









