ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఆహార భద్రతా చట్టం ద్వారా ఏ ఒక్కరూ ఆకలితో ఉండకుండా నిత్యావసర వస్తువులు సరఫరా చేస్తోందని పౌరసరఫరాల సంస్థ డైరెక్టర్ ఎనిమిరెడ్డి మాలకొండయ్య అన్నారు.సోమవారం కరప మండలం వేలంగిలోని మండల లెవెల్ స్టాక్ పాయింట్‌ను ఆయన తనిఖీ చేసి,స్టాక్ వివరాలు, తూకాలు, రికార్డులు పరిశీలించారు.తూకాలలో లోపాలు లేకుండా ఖచ్చితంగా సరుకులు సరఫరా చేయాలని సూచించారు.పేదలకు ఇచ్చే బియ్యం పేదలకే అందాలని, అక్రమంగా కొనుగోలు, విక్రయాలు చేస్తే కార్డులు రద్దు చేస్తామని హెచ్చరించారు.తూకాల్లో తేడా, స్టాక్ మళ్లింపులపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు.అనంతరం రేషన్ డీలర్లతో సమావేశమై వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.









