దర్జాగా ఏటీఎమ్‌లో దొంగతనానికి వెళ్లి, ఏటీఎమ్ మిషన్‌ను ఇష్టానుసారంగా బద్దలగొట్టి, అందులో నగదు తీసుకెళ్లే ప్రయత్నం చేసి విఫలమయ్యాడు ఓ దొంగ. కాకినాడ జిల్లా తునిలో ఏటీఎమ్ లోకి వెళ్లిన ఓ దొంగ ఇష్టం వచ్చినట్టు ఏటీఎమ్ ను బద్దలగొట్టాడు. సుమారు 20 నిమిషాల పాటు అతడు నగదు తీసుకెళ్లేందుకు విశ్వప్రయత్నాలు చేశాడు. నగదు ఎంతకీ రాకపోవడంతో అక్కడి నుండి విరమించుకున్నాడు. అయితే ఆ దొంగ చేసిన తతంగం మొత్తం సీసీ కెమెరాల సెంట్రల్ సర్వేలైన్ ద్వారా గమనించిన అధికారులు పోలీసు లకు ఫిర్యాదు చేయడంతో, స్పందించిన వారు వెంటనే గాలించడంతో దొంగ చిక్కాడు. అతడు అంతరాష్ట్ర దొంగగా పోలీసులు నిర్థారించారు.









