Search
Close this search box.

  ఫిబ్రవరి 9,10,11 తేదీలలో వార్షిక మహా సభలు

February 7, 2026 7:26 PM | Aditya369 News

ఫిబ్రవరి 9,10,11 తేదీలలో వార్షిక మహా సభలు

శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం నందు ఫిబ్రవరి 9,10,11 తేదీలలో 98 వ జ్ఞాన చైతన్య వార్షిక మహా సభలను నిర్వహించనున్నారు. పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా మాట్లాడుతూ ఆధ్యాత్మిక జ్ఞాన నేత్రం ద్వారా సృష్టిని సమాజాన్ని దర్శించగలిగితే మానవ జన్మకు పరిపూర్ణత లభిస్తుందని పేర్కొన్నారు.జాతి,కుల,మత,స్త్రీ,పురుష,ధనిక,పేద,వయో బేధాలకు అతీతంగా,అర్ష సూఫీ సిద్ధాంత స్ఫూర్తితో,సర్వమత సమ్మాతమైన ఈశ్వర ఏకత్వ ప్రత్తిపాదనతో కూడిన తాత్విక జ్ఞానం ఈ జ్ఞాన చైతన్య మహా సభలయందు ఉపదేశించబడుతుందని వెల్లడించారు. పీఠం కన్వీనర్ పేరూరు సూరిబాబు మాట్లాడుతూ 554 సంవత్సరాల సుధీర్ఘ చరిత్ర గల పీఠం అని అటువంటి పీఠం సభలు మూడు రోజుల పాటు అత్యంత వైభవంగా నిర్వహించ బడతాయని దేశ విదేశాల నుండి సుమారు 50 వేల మంది సభ్యులు హాజరవుతారన్నారు.సుమారు 900 మంది వాలంటీర్లు సేవలు అందిస్తారని వచ్చిన వారందరికీ ఉచిత భోజనం,వైద్య సౌకర్యం అందుబాటులో ఉంటాయని తెలిపారు.జిల్లా అధికారులు, యూనివర్సిటీ వైస్ ఛాన్సెలర్స్, సాహితీ వేత్తలు, రాజకీయ ప్రముఖులు, పుర ప్రముఖులు ఈ కార్యక్రమాలకు హాజరువుతారన్నారు. ప్రతీ రోజు ఉదయం 9గం జ్యోతి ప్రజ్వలన,విశ్వ ప్రార్ధనతో సభ ప్రారంభం, మధ్యాహ్నం 3.30 పీఠాధిపతి మంత్రోపదేశం చేస్తారని తెలిపారు. ఫిబ్రవరి 9,10 తేదీలలో సాయంత్రం 4 నుండి 6 వరకూ తాత్విక యువ వికాస్, సాయంత్రం 6 నుండి రాత్రి 8 వరకూ సాoస్కృతిక కార్యక్రమాలు నిర్వహించ బడతాయని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో మధుసూదనరావు,అశోక్, పీఠం మీడియా కన్వీనర్ ఆకుల రవితేజ, సెంట్రల్ కమిటీ సభ్యులు ఏవివి సత్యనారాయణ, ఎన్టీవీ వర్మ,డాక్టర్ పింగళి ఆనందకుమార్, భాస్కర్ పాల్గొన్నారు.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు