కరపలో జరిగిన సామూహిక ఎలుకల నిర్మూలన మందు పంపిణీ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ శాఖధికారి డా.ఎన్.విజయ్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని రైతులకు ఎలుకల మందు పంపిణీ చేశారు. గోదావరి జిల్లాల్లో ఎలుకల ఉధృతి వరి పంటకు తీవ్ర నష్టం కలిగిస్తోందని ప్రభుత్వం ఉచితంగా అందించిన బ్రోమోడయోలిన్ తెల్ల మందును తొలకరి,దాల్వ పంటల సమయంలో పొలం గట్ల మీద నూకలు పెట్టి ఎలుకల నష్టాన్ని నివారించాలని రైతులకు విజ్ఞప్తి చేశారు.APAIMS 2.0 మొబైల్ అప్లికేషన్‌ను అందరూ డౌన్‌లోడ్ చేసుకోవాలని, దీని ద్వారా పంటల నమోదు, వ్యవసాయ సమాచారం పొందవచ్చని సూచించారు. జడ్.భావరం సొసైటీ వద్ద జరిగిన మండల స్థాయి కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి ఐ సత్య ముఖ్య అతిథిగా పాల్గొని ఎలుకల నివారణ పద్ధతులు తెలియజేసి,100 కేజీల నూకలు రైతులకు అందజేశారు.ఈ కార్యక్రమంలో కరప సబ్ డివిజన్ ఏడీఏ కె.బాబురావు,సొసైటీ చైర్మన్ గంటా వీరన్న చౌదరి, జనసేన నాయకులు బత్తుల సతీష్,వీరంరెడ్డి ముత్యాలరావు, గోన ఆంజనేయులు, బోనాసు పుల్లయ్య ప్రసాద్, నక్కా బ్రహ్మాజీ, యరమాటి మార్కండేయులు, సీఈవో రాయుడు వెంకటేశ్వరరావు, కూటమి నాయకులు, రైతులు పాల్గొన్నారు.









