రోడ్డు ప్రమాదాలు అరికట్టాలంటే వాహనాల వేగం తగ్గించే విధంగాఅవగాహన కల్పించాలని కోనసీమ జిల్లా కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్ స్పష్టం చేశారు. జిల్లా రహదారి భద్రత కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ అధ్య క్షతన జాయింట్ యాక్షన్ కమిటీ సభ్యులతో నిర్వహించారు.రోడ్డు ప్రమాదాల నివారణ, బ్లాక్ స్పాట్స్ సరిదిద్దే చర్యలు, రహ దారి భద్రతా ప్రమా ణాల అమలు వంటి కీలక అంశాలను, గత సమావేశపు మినిట్స్ పై తీసుకున్న నిర్ణయాల పురో గతిని సమీక్షించారు.రహదారులపై స్పష్టమైన రోడ్డు గుర్తులు, సైన్ బోర్డులు, రిఫ్లెక్టర్లు, రేడియం స్టిక్కర్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. జిల్లా ఎస్పీ రాహుల్ మీనా ,డిఆర్ఓ కొత్త మాధవి, ఆర్ అండ్ బి ఎస్ఈ, బి రాము, ఆర్టీవో డి శ్రీనివాసరావు, డిఎంహెచ్వో దుర్గారావు దొర, ఎన్ హెచ్ ఈఈ శ్రీనివాసరావు, ఏఈ వెంకట రమణ, డీఎస్సీ టి.ఆర్ఎస్కే ప్రసాద్, ము న్సిపల్ కమిషనర్ వి. నిర్మల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.









