Search
Close this search box.

  నూతనంగా చేపట్టాల్సిన ప్రాజెక్టులకు సంబంధించిన ప్రతిపాదనలు సిద్ధం చేయాలి…. కలెక్టర్ షాన్ మోహన్ సగిలి

February 3, 2026 8:24 PM | Aditya369 News

నూతనంగా చేపట్టాల్సిన ప్రాజెక్టులకు సంబంధించిన ప్రతిపాదనలు సిద్ధం చేయాలి…. కలెక్టర్ షాన్ మోహన్ సగిలి

విశాఖపట్నం ఎకనామిక్ రీజియన్ పరిధిలో కాకినాడ జిల్లా నుంచి నూతనంగా చేపట్టాల్సిన వివిధ ప్రాజెక్టులకు సంబంధించిన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ సగిలి అధికారులను ఆదేశించారు.మంగళవారం కలెక్టర్ షాన్ మోహన్ సగిలి పరిశ్రమ,మున్సిప ల్ కార్పొరేషన్,పర్యాటక,ఆర్అండ్బి,పశుసంవర్థక,మత్స్య,వైద్య ఆరోగ్యం,ఉద్యాన,జాతీయ రహదారులు తదితర శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం నీతి ఆయోగ్ వర్టికల్స్ ప్రాజెక్టులో భాగంగా విశాఖపట్నం, చుట్టుపక్కల ఉన్న 9 జిల్లాలతో విశాఖపట్నం ఎకనామిక్ రీజియన్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.ఇందులో భాగంగా కాకినాడ జిల్లాలో పరిశ్రమ, మున్సిపల్ కార్పొరేషన్, పర్యాటక, ఆర్ అండ్ బి, హౌసింగ్ , పశుసంవర్థక, మత్స్య, వైద్య ఆరోగ్యం తదితర శాఖల్లో ప్రస్తుతం చేపట్టిన, భవిష్యత్తులో చేపట్టబోయే నూతన ప్రాజెక్టులకు సంబంధించిన ప్రతిపాదనలు రూపొందించాలని ఆయన అధికారులను ఆదేశించారు.ఈ సమావేశంలో జిల్లా పరిశ్రమల శాఖ జిఎం సీహెచ్.గణపతి, ఏపీఐఐసీ జోనల్ మేనేజర్ రమణారెడ్డి, పశుసంవర్ధక శాఖ జెడీ డా.కె.కృష్ణమూర్తి, ఆర్ అండ్ బీ ఎస్ఈ జి.కాంఠు, మత్స్య శాఖ ఏడి కె.కరుణాకర్, కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్, హౌసింగ్, ఉద్యాన ఇతర శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు