పిఠాపురం ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ ఉమా కుక్కుటేశ్వర స్వామి వారి దేవస్థానం(పాదగయ) హుండీల లెక్కింపు కార్యక్రమం డిఇఓ కనపర్తి నాగేశ్వరరావు,ఇన్స్పెక్టర్ వడ్డి ఫణీంద్ర కుమార్,సమీపఆలయాల కార్యనిర్వహణాధికారులు అశ్విని,ధనలక్ష్మి పర్యవేక్షణలో ఆలయ కార్యనిర్వహణాధికారి కాట్నం జగన్మోహన్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో మంగళవారం జరిగింది.ఈ సందర్భంగా ఆలయ ఈవో మాట్లాడుతూ 55 రోజులకుగాను హుండీల ద్వారా రూ14,88,774/-, అన్నదానం హుండీ ద్వారా రూ 90,118/- వెరసి రూ 15,78,892/-లు ఆదాయం వచ్చిందని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఆలయ సిబ్బంది, భక్త బృందం,బ్యాంకు, పోలీసు, రెవిన్యూ సిబ్బంది,అర్చకులు,తదితరులు పాల్గొన్నారు.









