పంచమాధవ క్షేత్రాల్లో ఒకటైన శ్రీ కుంతీ మాధవ స్వామి దేవస్థానం హుండీలను మంగళవారం దేవాదాయ శాఖధికారి ఇన్స్పెక్టర్ వడ్డీ ఫణీంద్ర కుమార్ ఆధ్వర్యంలో లెక్కించారు.ఒక సంవత్సరం ఆదాయం రూ 2,89,195/- వచ్చిందని గత సంవత్సరంతో పోలిస్తే రూ17,700/- ఆదాయం పెరిగినట్లు అధికారులు తెలిపారు.ఈ లెక్కింపులో ఆలయ కార్యనిర్వహణధికారి బి ధనలక్ష్మి, భక్త బృందం సభ్యులు,సిబ్బంది ఉన్నారు









