మాఘ పౌర్ణమి రోజు చేసే సముద్ర లేదా నదీ స్నానం వల్ల పాపాలు తొలగుతాయనేది భక్తుల నమ్మకం.
దుఃఖం, దరిద్రం, అనారోగ్యం, అపమృత్యు దోషం తొలగుతాయని, ఐశ్వర్యం సిద్ధిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. స్నానం చేసి సూర్యనారాయణుడికి, శ్రీమన్నారాయణునికి అర్ఘ్యం సమర్పించాలి. ఫిబ్రవరిలో పంచగ్రహ కూటమి 12 నుంచి 15 రోజులు ఉంటుంది. మాఘ పౌర్ణమి రోజు ఎవరైతే సూర్యుడిని, అమ్మవారిని ప్రార్థిస్తారో వారికి ఆయష్షు పెరిగి, అనారోగ్య సమస్యలు తొలగుతాయని పండితులు చెబుతున్నారు.









