కాకినాడ జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం పిఠాపురంలోని కుంతీమాధవుడి రథోత్సవం శనివారం అంగరంగవైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కుంతీమాధవుడి దివ్య కళ్యాణోత్సవాలు ఫిబ్రవరి 2న శ్రీ పుష్పయాగంతో ముగుస్తాయి. శనివారం రథోత్సవం అనంతరం ఉప్పాడలో పుణ్యస్నానాలు జరుగుతాయి. శుక్రవారం రాత్రి పొన్నవాహనంపై మాధవుడిని ఊరేగించారు.









