Search
Close this search box.

  ధర్మం కోసం తన శిరస్సుని త్యాగం చేసిన మహనీయుడు ఆయన..గురు తేగ్ బహదూర్ సింగ్ షాహిదీ సమాగమంలోప‌వ‌న్ ప్ర‌సంగంపై గూజ్‌బంప్స్‌

‘తల్వార్ తోనే కాదు త్యాగంతోనూ ధర్మ పరిరక్షణ సాధ్యమని చాటిన మహనీయుడు గురు తేగ్ బహదూర్ జీ అని తనది కాని ధర్మం కోసం తన శిరస్సుని త్యాగం చేసిన మహనీయుడు ఆయన. అందుకే చరిత్ర గురు తేగ్ బహదూర్ సింగ్ జీని ధరమ్ ది చాదర్.. ఔర్ హింద్ ది ఛాదర్ గా కీర్తిస్తుంద’ని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఆయన బలిదానాన్ని యావత్ భారత దేశం సత్యం, సాహసం, భావోద్వేగంతో ముందుకు తీసుకువెళ్తుందని చెప్పారు.

తేగ్ బహదూర్ జీ స్ఫూర్తితో ప్రతి పౌరుడు ధర్మాన్ని ఒక హక్కుగా కాకుండా బాధ్యతగా స్వీకరించాలని పిలుపునిచ్చారు. స్వతంత్ర ఫలాలను అనుభవించే ప్రతి భారతీయ పౌరుడు మన దేశ ఔన్నత్యాన్ని భుజస్కందాలపై మోస్తున్నామన్న సంగతిని గుర్తెరిగి మసలుకోవాలని కోరారు. ప్రతి ఒక్కరు ధర్మాన్ని కేవలం ఒక సంప్రదాయంగా మాత్రమే కాదు బాధ్యతగా స్వీకరించాలి. స్వాతంత్ర్యాన్ని ధర్మ సాధన మార్గంగా ముందుకు తీసుకువెళ్లాలని చెప్పారు. ఆదివారం సాయంత్రం మహారాష్ట్రలోని నాందేడ్ లో ప్రముఖ సిక్కు గురువు తేగ్ బహదూర్ సింగ్ జీ 350వ షాహిదీ సమాగమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ “350 ఏళ్లు గడచినప్పటికీ మనమంతా గురు తేగ్ బహదూర్ సింగ్ జీ బలిదానాన్ని స్మరిస్తున్నామంటే ఆయన త్యాగం కేవలం ఒక చారిత్రక సంఘటన మాత్రమే కాదు. ప్రతి మనిషిలోని వివేకానికి పరీక్ష పెట్టిన ఘటన. 1675 నవంబర్ 24వ తేదీన ఢిల్లీలోని చాందినీ చౌక్ వద్ద పెద్ద సమూహం నిలబడి ఉన్నా అందరిలోనూ తెలియని భయం వ్యాపించి ఉంది.

ఓ వైపు సమూహం మరోవైపు ప్రభుత్వం, ఇంకో వైపు ఓ శాంతి దూత ఉన్నారు. తన త్యాగంతో ధర్మ పరిరక్షణ సాధ్యమన్న విషయం ఆ దూతకి తెలుసు. బలిదానం అయిన ఆయన్ను తీసుకువెళ్లేందుకు కూడా ఎవరూ సాహసించలేదు. ఆయన బలిదానం నేడు పొరుగు దేశాల్లో ఉన్న హిందూ మైనారిటీల వేదనను గుర్తు చేస్తుంది.గురు తేగ్ బహదూర్ జీ త్యాగం ఒక చరిత్ర మాత్రమే కాదు. మనందరికీ ఒక హెచ్చరిక. ఈ వేదిక నుంచి భారతీయ యువతకు ఒక మాట చెప్పదలచుకున్నా. గురు తేగ్ బహదూర్ జీ జీవితం నుంచి నేర్చుకోవాల్సింది ఒకటే. మన దేశానికి నేడు బలంగా మాట్లాడే స్వరం అవసరం లేదు.. ఉన్నతమైన వ్యక్తిత్వంతో కూడిన స్వరం అవసరం. అని ప‌వ‌న్ అన్నారు.

ఈ కార్యక్రమంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ , ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్ , సిక్కు మత పెద్దలు బాబా కుల్వంత్ సింగ్ , బల్వేందర్ సింగ్ బాబా , బాబూ సింగ్ మహారాజ్ ఇతర మత పెద్దలు, వివిధ రాష్ట్రాలకు చెందిన రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు