తెలంగాణాలోని పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌లోని ఒక స్వీట్ షాప్ వద్ద ఒక కుటుంబం కారు తాళాలను కారులోనే వదిలేయడంతో కారులోనే ఒక చిన్నారి చిక్కుకుపోయింది.డోర్ లాక్ కావడంతో చిన్నారి ఎంత ప్రయత్నించినా బయటకు రాలేకపోయింది. అప్పుడే అక్కడికి వచ్చిన ఓ యువకుడు తన సెల్‌ఫోన్‌లో డోర్ ఎలా తెరవాలో ఒక వీడియో చూపించాడు.ఆ వీడియో చూసిన చిన్నారి తెలివిగా డోర్ తెరిచి క్షేమంగా బయటపడింది. సమయస్ఫూర్తితో వ్యవహరించి చిన్నారిని కాపాడిన ఆ యువకుడిని స్థానికులు అభినందించారు. వీడియో చూసి తాళం తీసిన చిన్నారి తెలివికి అక్కడి వారు ఫిదా అయ్యారు.
