Search
Close this search box.

  ‘స్పిరిట్’ కోసం వంగా మాస్టర్ ప్లాన్.. ప్రభాస్ ఫ్యాన్స్‌కు పూనకాలే..!

May 25, 2026 11:22 PM | Aditya369 News

‘స్పిరిట్’ కోసం వంగా మాస్టర్ ప్లాన్.. ప్రభాస్ ఫ్యాన్స్‌కు పూనకాలే..!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస భారీ ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఆయన చేతిలో ఇప్పటికే అరడజనుకు పైగా క్రేజీ సినిమాలు ఉండగా.. వాటిలో అభిమానులు అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రాజెక్ట్ ‘స్పిరిట్’. సంచలన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తెరకెక్కిస్తున్న ఈ యాక్షన్ డ్రామాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.

ప్రభాస్ బర్త్‌డే సందర్భంగా విడుదలైన పోస్టర్ సోషల్ మీడియాలో సంచలనం సృష్టించింది. రఫ్ అండ్ వైల్డ్ లుక్‌లో కనిపించిన ప్రభాస్‌ను చూసి అభిమానులు ఫుల్ ఖుషీ అవుతుండగా.. ముఖ్యంగా లేడీ ఫ్యాన్స్ మాత్రం ఆ లుక్‌కు ఫిదా అవుతున్నారు. ఇక సందీప్ రెడ్డి వంగా సినిమాలంటే రొమాన్స్, ఎమోషన్, ఇంటెన్స్ కెమిస్ట్రీకి ప్రత్యేక గుర్తింపు ఉంటుంది. దీంతో ‘స్పిరిట్’లో కూడా ప్రభాస్‌ను సరికొత్త రొమాంటిక్ యాంగిల్‌లో చూపిస్తాడనే అంచనాలు పెరిగాయి.

ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించి మరో క్రేజీ అప్డేట్ ఇండస్ట్రీలో వైరల్ అవుతోంది. వచ్చే నెల మొదటి వారంలో ప్రభాస్, త్రిప్తి డిమ్రీ కాంబినేషన్‌లో ఓ స్పెషల్ సాంగ్ షూట్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. ఈ పాట కోసం ప్రత్యేకంగా భారీ సెట్స్ నిర్మిస్తున్నారని, హై లెవల్ విజువల్ ఎఫెక్ట్స్‌తో ఇండియన్ సినిమా స్థాయిని మరో లెవల్‌కు తీసుకెళ్లేలా ఈ సాంగ్‌ను డిజైన్ చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది.

భారీ బడ్జెట్‌తో తెరకెక్కనున్న ఈ స్పెషల్ సాంగ్ సినిమాకే హైలైట్‌గా నిలుస్తుందని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. “వంగా ప్లాన్ అంటే మామూలుగా ఉండదు” అంటూ ప్రభాస్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఇప్పటికే హంగామా మొదలుపెట్టారు. ఈ సాంగ్ ఎలా ఉండబోతోందో చూడాలంటే ఇంకొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

ఇక ఈ సినిమాలో ప్రభాస్ లుక్‌పై కూడా భారీగా చర్చ సాగుతోంది. ఇప్పటివరకు చూడని విధంగా ఓ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో ప్రభాస్ కనిపించనున్నాడని సమాచారం. భారీ ఫిజిక్, రఫ్ స్టైలింగ్, ఇంటెన్స్ యాక్షన్, స్పెషల్ బాడీ లాంగ్వేజ్‌తో ప్రభాస్ ఈ సినిమాలో పూర్తిగా కొత్తగా కనిపించనున్నాడట. ఈ కాప్ రోల్ కోసం ప్రత్యేకంగా ట్రైనింగ్ కూడా తీసుకున్నట్లు తెలుస్తోంది.

‘అర్జున్ రెడ్డి’, ‘యానిమల్’ వంటి బ్లాక్‌బస్టర్‌ల తర్వాత సందీప్ రెడ్డి వంగా తెరకెక్కిస్తున్న సినిమా కావడంతో ‘స్పిరిట్’పై అంచనాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ప్రభాస్ కెరీర్‌లోనే ఇది మరో హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా నిలవొచ్చని అభిమానులు భావిస్తున్నారు. మరి ఈ సినిమా ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore