Search
Close this search box.

  విజయ్ సేతుపతి మూవీకి షాక్..! పూరి సినిమాకు బయ్యర్లు దొరకట్లేదా..?

April 16, 2026 11:11 PM | Aditya369 News

విజయ్ సేతుపతి మూవీకి షాక్..! పూరి సినిమాకు బయ్యర్లు దొరకట్లేదా..?

టాలీవుడ్‌లో డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్‌గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న పూరి జగన్నాథ్ ఒకప్పుడు హిట్‌కు మరో పేరు. ఆయన సినిమా వస్తోంది అంటే బాక్సాఫీస్ వద్ద ఖచ్చితంగా సంచలనమే అన్న నమ్మకం ఉండేది. స్టార్ హీరోలందరికీ గుర్తుండిపోయే బ్లాక్‌బస్టర్‌లు అందించిన పూరి… ఇప్పుడు మాత్రం కాస్త కష్టకాలాన్ని ఎదుర్కొంటున్నట్టు కనిపిస్తోంది. ఇటీవల వరుసగా వచ్చిన సినిమాలు ఆశించిన స్థాయిలో ఆడకపోవడంతో, తెలుగు హీరోలు ఆయనతో పనిచేయడానికి వెనకడుగు వేస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి.

ఇక తాజాగా తమిళ స్టార్ విజయ్ సేతుపతి హీరోగా పూరి తెరకెక్కించిన ‘స్లమ్ డాగ్’ సినిమా షూటింగ్ చాలా కాలం క్రితమే పూర్తయింది. విజయ్ సేతుపతి పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్ర టైటిల్‌తో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. కానీ ఆ తర్వాత సినిమా గురించి పెద్దగా ఎలాంటి అప్‌డేట్ లేకపోవడం అభిమానుల్లో సందేహాలను పెంచుతోంది.

సినిమా పూర్తయి ఇంత కాలం అయినా విడుదల కాకపోవడానికి కారణాలు లేకపోలేదు. పూరి గత సినిమాలు బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచిన నేపథ్యంలో, ‘స్లమ్ డాగ్’ను కొనుగోలు చేయడానికి డిస్ట్రిబ్యూటర్లు ఆసక్తి చూపలేదని సమాచారం. అంతేకాకుండా ఈ చిత్రానికి సంబంధించిన ఓటీటీ డీల్ కూడా ఇంకా ఫైనల్ కాలేదట. దీంతో సినిమా రిలీజ్ విషయమే అనిశ్చితంగా మారింది.

ఇక ఈ ప్రాజెక్ట్‌పై పూరి జగన్నాథ్ కూడా సైలెంట్‌గా ఉండటం గమనార్హం. ఎలాంటి కొత్త అప్డేట్స్ లేకపోవడంతో అభిమానులు మరింత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ చిత్రంలో విజయ్ సేతుపతితో పాటు సంయుక్త మీనన్ హీరోయిన్‌గా నటించగా, సీనియర్ నటి టబు కీలక పాత్ర పోషించారు.

ఇన్ని ప్రముఖులు ఉన్నప్పటికీ సినిమా విడుదలలో ఆటంకాలు ఎదురవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ప్రస్తుతం ‘స్లమ్ డాగ్’ సక్సెస్ పూరి జగన్నాథ్ కెరీర్‌కు చాలా కీలకంగా మారింది. ఈ సినిమా హిట్ అయితేనే ఆయన మళ్లీ ఫామ్‌లోకి వస్తారనే అభిప్రాయం సినీ వర్గాల్లో వ్యక్తమవుతోంది.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు