సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా, దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక పాన్ వరల్డ్ చిత్రం ‘వారణాసి’పై రోజురోజుకూ అంచనాలు పెరుగుతున్నాయి. భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమాపై ప్రపంచవ్యాప్తంగా సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఈ సినిమాలో మహేష్ బాబు పలు విభిన్న గెటప్స్‌లో కనిపించనున్నారని ఇప్పటికే వార్తలు వినిపిస్తున్నాయి. వాటిలో ముఖ్యంగా శ్రీరాముడి అవతారం సినిమాలో హైలైట్‌గా నిలుస్తుందని ప్రచారం జరుగుతోంది. ఈ గెటప్ గురించి గతంలో ఓ భారీ వేదికపై దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి చేసిన వ్యాఖ్యలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
అయితే తాజాగా మహేష్ బాబు శ్రీరాముడి గెటప్‌లో ఉన్నట్లు కనిపిస్తున్న ఓ ఫోటో సోషల్ మీడియాలో విపరీతంగా చక్కర్లు కొడుతోంది. అది సినిమా సెట్స్ నుంచి లీక్ అయిన అసలైన ఫొటో అంటూ పలువురు అభిమానులు నమ్ముతున్నారు.
కానీ ఇందులో ఎలాంటి నిజం లేదు. వైరల్ అవుతున్న ఆ ఫోటో సినిమా యూనిట్ నుంచి లీక్ కాలేదు. అది పూర్తిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాయంతో రూపొందించిన చిత్రం మాత్రమే. ఫోటోను కాస్త జాగ్రత్తగా పరిశీలిస్తే అది నిజమైన సెట్స్ ఫోటో కాదని స్పష్టంగా అర్థమవుతుంది.
నిజమే… గతంలో ‘వారణాసి’ సెట్స్ నుంచి కొన్ని ఫొటోలు, వీడియోలు లీక్ అయిన సందర్భాలు ఉన్నాయి. అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న మహేష్ బాబు శ్రీరాముడి గెటప్ ఫోటో మాత్రం పూర్తిగా ఫేక్. కాబట్టి అభిమానులు అలాంటి ప్రచారాలను నమ్మకుండా అధికారిక అప్డేట్స్ కోసం మాత్రమే ఎదురుచూడడం మంచిది.









