Search
Close this search box.

  ‘వారణాసి’లో మైండ్ బ్లోయింగ్ రామాయణ సీక్వెన్స్..!

May 25, 2026 11:21 PM | Aditya369 News

‘వారణాసి’లో మైండ్ బ్లోయింగ్ రామాయణ సీక్వెన్స్..!

దర్శకధీరుడు రాజమౌళి సినిమాల్లో పురాణాల టచ్ ఎంత పవర్‌ఫుల్‌గా ఉంటుందో ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ‘బాహుబలి’లో శివుడి ఎలివేషన్ అయినా.. ‘RRR’ క్లైమాక్స్‌లో రామ్ చరణ్ రాముడి గెటప్‌లో కనిపించిన క్షణమైనా.. ఆ సీన్లు థియేటర్లలో ప్రేక్షకులకు గూస్‌బంప్స్ తెప్పించాయి. ఇప్పుడు అదే మ్యాజిక్‌ను మరింత భారీ స్థాయిలో రిపీట్ చేయడానికి జక్కన్న సిద్ధమవుతున్నట్టు సమాచారం.

ప్రస్తుతం మహేష్ బాబుతో తెరకెక్కిస్తున్న భారీ అడ్వెంచర్ చిత్రం ‘వారణాసి’లో రామాయణం ఆధారంగా ఓ స్పెషల్ ఎపిసోడ్‌ను రాజమౌళి ప్లాన్ చేసినట్టు టాక్ నడుస్తోంది. అయితే సోషల్ మీడియాలో వినిపిస్తున్నట్టుగా అది 15 నిమిషాల సీక్వెన్స్ మాత్రమే కాదట.. ఏకంగా 25 నిమిషాల పాటు సాగే విజువల్ వండర్ అని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.

ఈ భారీ ఎపిసోడ్ కోసం చిత్ర యూనిట్ దాదాపు 60 రోజుల పాటు నిరంతరం షూటింగ్ చేసినట్టు తెలుస్తోంది. రామాయణంలోని పలు కీలక ఘట్టాలను కలిపి రూపొందిస్తున్న ఈ సీక్వెన్స్.. ఒక చిన్న సినిమా తీసినంత భారీ స్థాయిలో తెరకెక్కిందని సమాచారం. సాంకేతికంగా ఎన్నో కొత్త ప్రయోగాలు చేస్తూ, హాలీవుడ్ రేంజ్ విజువల్స్‌తో దీన్ని రూపొందిస్తున్నారని తెలుస్తోంది.

ఇక ఈ ఎపిసోడ్ గురించి రాజమౌళి చెప్పిన ఒక విషయం ఇప్పుడు అభిమానుల్లో మరింత ఆసక్తిని పెంచుతోంది. మహేష్ బాబు మొదటిసారి లార్డ్ రామ గెటప్‌లో సెట్‌లోకి వచ్చిన క్షణం తనకు ఒళ్ళు గగుర్పొడిచిందని రాజమౌళి చెప్పారట. “మహేష్‌లో శ్రీకృష్ణుడి చార్మ్‌తో పాటు శ్రీరాముడి ప్రశాంతత కూడా కనిపించింది. ఆ లుక్ చూసిన వెంటనే నా ఫోన్ వాల్‌పేపర్‌గా పెట్టుకున్నాను” అని ఆయన చెప్పినట్టు సమాచారం.

మహేష్ బాబు కూడా ఈ పాత్ర కోసం ప్రత్యేకంగా సిద్ధమైనట్టు తెలుస్తోంది. పౌరాణిక పాత్రల్లో బాడీ లాంగ్వేజ్, నడక, హావభావాలు అన్నీ ప్రత్యేకంగా ఉండాలని.. అందుకే దీనిపై చాలా శ్రద్ధ పెట్టానని ఆయన చెప్పారట. అలాగే తన తండ్రి సూపర్ స్టార్ కృష్ణకు తనను ఓ పౌరాణిక పాత్రలో చూడాలనే కోరిక ఉండేదని.. ఇప్పుడు ఆ కల ఈ సినిమాతో నెరవేరుతోందని మహేష్ భావోద్వేగానికి లోనయ్యారని సమాచారం.

ఇక ఈ 25 నిమిషాల ఎపిసోడ్ కోసం హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో ఏర్పాటు చేసిన భారీ మోషన్ క్యాప్చర్ ఫెసిలిటీని ఉపయోగించినట్టు తెలుస్తోంది. హాలీవుడ్ స్థాయి టెక్నాలజీతో, ఇంటర్నేషనల్ స్టంట్ మాస్టర్స్ పర్యవేక్షణలో ఈ సీక్వెన్స్‌ను చిత్రీకరించారట. టైమ్ ట్రావెల్ అడ్వెంచర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మహేష్ బాబు ‘రుద్ర’ అనే అడ్వెంచరర్ పాత్రతో పాటు లార్డ్ రామ అవతారంలోనూ కనిపించనున్నారని టాక్.

ప్రియాంకా చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ భారీ చిత్రం 2027 ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇప్పటికే ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొనగా.. ఇప్పుడు ఈ 25 నిమిషాల రామాయణ ఎపిసోడ్ వార్తతో సినిమా హైప్ మరింత పెరిగిపోయింది.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore