Search
Close this search box.

  యశ్ రావణుడిగా ‘రామాయణ’ లో భారీ ప్లాన్ రివీల్..!

April 16, 2026 12:07 AM | Aditya369 News

యశ్ రావణుడిగా ‘రామాయణ’ లో భారీ ప్లాన్ రివీల్..!

కన్నడ సూపర్‌స్టార్, పాన్ ఇండియా హీరో Yash తన రాబోయే భారీ చిత్రం Ramayana గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘సినిమాకాన్ 2026’ ఈవెంట్‌లో పాల్గొన్న ఆయన… ఈ మహాగాథ ప్రత్యేకతను వివరించారు. ముఖ్యంగా ఈ సినిమాలో రావణుడి పాత్రలో యశ్ నటించడం ప్రాజెక్ట్‌పై మరింత హైప్ పెంచుతోంది.

ఈ సందర్భంగా యశ్ మాట్లాడుతూ… “రామాయణం అనేది కేవలం ఒక కథ కాదు, తరాల తరబడి నిలిచిపోయే భావోద్వేగం. సరిహద్దులు, సంస్కృతులు దాటి ప్రపంచవ్యాప్తంగా ప్రజల హృదయాల్లో నిలిచిపోయింది. అదే దీని అసలైన శక్తి” అని తెలిపారు. ఇక ఆధునిక టెక్నాలజీతో ఈ కథను తెరపై చూపిస్తే… ప్రేక్షకులకు ఒక కొత్త అనుభూతి కలుగుతుందని ఆయన అన్నారు.

ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని దర్శకుడు Nitesh Tiwari తెరకెక్కిస్తుండగా… Namit Malhotra నేతృత్వంలోని ప్రైమ్ ఫోకస్ స్టూడియోస్, ఆస్కార్ విన్నింగ్ సంస్థ DNEG, అలాగే యశ్‌కు చెందిన మాన్‌స్టర్ మైండ్ క్రియేషన్స్ కలిసి నిర్మిస్తున్నాయి.

ఇక ఈ సినిమాలో Ranbir Kapoor శ్రీరాముడి పాత్రలో కనిపించనుండగా… Sai Pallavi, Sunny Deol, Ravi Dubey కీలక పాత్రలు పోషిస్తున్నారు. సంగీతాన్ని A. R. Rahman మరియు హాలీవుడ్ దిగ్గజం Hans Zimmer అందిస్తున్నారు.

అయితే ఇటీవల Ranbir Kapoor ఫస్ట్ లుక్‌కు సంబంధించిన వీఎఫ్ఎక్స్‌పై సోషల్ మీడియాలో కొంత నెగెటివ్ టాక్ వినిపించింది. అయినప్పటికీ, మేకర్స్ ఈ చిత్రాన్ని అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో రూపొందిస్తున్నామని చెబుతున్నారు.

రెండు భాగాలుగా రానున్న ఈ భారీ ప్రాజెక్ట్‌లో మొదటి భాగం 2026 దీపావళికి, రెండో భాగం 2027 దీపావళికి ఐమ్యాక్స్ ఫార్మాట్‌లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

మొత్తానికి… ఇండియన్ సినిమాలో మరో విజువల్ వండర్‌గా ‘రామాయణ’ నిలవబోతోందా లేదా అన్నది చూడాలి!

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore