మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ – దర్శకుడు బుచ్చి బాబు సాన కాంబినేషన్లో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘పెద్ది’పై రోజురోజుకీ అంచనాలు పెరుగుతున్నాయి. జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ సినిమా ప్రమోషన్స్‌ను మేకర్స్ భారీ స్థాయిలో ప్లాన్ చేస్తున్నారు. అందులో భాగంగానే మే 23న భోపాల్‌లోని బీహెచ్ఈఎల్ దసరా గ్రౌండ్స్‌లో గ్రాండ్ మ్యూజికల్ ఈవెంట్ నిర్వహించనున్నారు.
ఈ ఈవెంట్‌కు మరో స్పెషల్ అట్రాక్షన్ కూడా ఉండబోతోంది. ఆస్కార్ విజేత A. R. రెహమాన్ఈ వేడుకలో లైవ్ పెర్ఫార్మెన్స్ ఇవ్వబోతుండటంతో ఫ్యాన్స్‌లో భారీ ఎక్సైట్మెంట్ నెలకొంది. ఇక ఈ కాన్సర్ట్‌ను దేశంలోనే ఎప్పుడూ చూడని స్థాయిలో నిర్వహించేందుకు మేకర్స్ భారీ ఏర్పాట్లు చేస్తున్నారట.
ముఖ్యంగా ఈ ఈవెంట్ కోసం ముంబై నుంచి దాదాపు రూ.150 కోట్ల విలువైన అత్యాధునిక మ్యూజిక్ ఎక్విప్మెంట్ను ప్రత్యేకంగా రప్పిస్తున్నట్లు సమాచారం. ఈ ఎక్విప్మెంట్ అద్దె కోసమే నిర్మాతలు దాదాపు రూ.1 కోటి వరకు ఖర్చు చేస్తున్నారట. సౌండ్ క్వాలిటీ, స్టేజ్ సెటప్, లైవ్ ఎక్స్పీరియన్స్ విషయంలో ఎలాంటి రాజీ పడకుండా ఈ ఈవెంట్‌ను పాన్ ఇండియా రేంజ్లో ప్లాన్ చేస్తున్నారని టాక్.
ఇక యూవీ మీడియా నిర్వహిస్తున్న ఈ వేడుకలో ‘పెద్ది’ చిత్రానికి సంబంధించిన ఓ స్పెషల్ సాంగ్‌ను కూడా గ్రాండ్‌గా లాంచ్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ భారీ ఈవెంట్‌ను ప్రత్యక్షంగా వీక్షించాలనుకునే అభిమానుల కోసం రేపటి నుంచి వేదిక వద్ద ఉచిత పాస్‌లను పంపిణీ చేయనున్నారు. ప్రస్తుతం ఈ ఈవెంట్‌కు సంబంధించిన ఏర్పాట్లు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి.








