నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. ఇటీవల విడుదలైన ‘అఖండ 2’ సినిమా అభిమానులు ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోవడంతో కొంత నిరాశ నెలకొంది. బాలకృష్ణ–బోయపాటి శ్రీను కాంబినేషన్ అంటే ఎప్పుడూ సూపర్ హిట్ అనే ఇమేజ్ ఉన్నప్పటికీ, ఈసారి ఆ మ్యాజిక్ పూర్తిగా రిపీట్ కాలేదనే టాక్ వినిపిస్తోంది.
అయితే ఈ ఫలితాన్ని పక్కన పెట్టి బాలయ్య తన తదుపరి ప్రాజెక్టులపై ఫుల్ ఫోకస్ పెట్టారు. ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న NBK 111 షూటింగ్ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. ఈ సినిమా ఇప్పటికే సెట్స్‌పైకి వెళ్లిన సంగతి తెలిసిందే.
ఇదే సమయంలో బాలకృష్ణ మరో రెండు క్రేజీ ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి. అందులో ముఖ్యంగా దర్శకుడు కొరటాల శివతో ఓ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ చేయబోతున్నట్టు సమాచారం. అలాగే దర్శకుడు వివేక్ ఆత్రేయతో కూడా ఓ ప్రత్యేకమైన సినిమా కోసం చర్చలు జరుగుతున్నట్లు టాక్ నడుస్తోంది.
మే 1న పూజా కార్యక్రమాలు
కొరటాల శివ చెప్పిన పవర్ఫుల్ యాక్షన్ స్టోరీ బాలకృష్ణకు బాగా నచ్చడంతో వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ పనులు కూడా దాదాపు పూర్తయ్యాయని సమాచారం. తాజాగా ఈ మూవీ పూజా కార్యక్రమాల తేదీ కూడా ఫిక్స్ అయినట్లు ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.
బాలకృష్ణ–కొరటాల శివ కాంబినేషన్లో రాబోతున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రం మే 1న ఘనంగా పూజా కార్యక్రమాలతో ప్రారంభం కానుంది. అనంతరం ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసి జూన్ నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించనున్నట్లు సమాచారం.
2027 సంక్రాంతిని టార్గెట్
ఈ సినిమాను 2027 సంక్రాంతి బరిలోకి దింపేలా ప్లాన్ చేస్తున్నట్టు టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా NBK 111 షూటింగ్‌తో పాటు ఈ సినిమా పనులు కూడా సమాంతరంగా కొనసాగనున్నాయని సమాచారం.
ఈ చిత్రాన్ని SLV Cinemas బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మించనున్నట్లు తెలుస్తోంది. సంగీత దర్శకుడు, హీరోయిన్, ఇతర కీలక నటీనటుల వివరాలు ఇంకా అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. త్వరలోనే చిత్రబృందం నుంచి దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది









