గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న మోస్ట్ అవేటెడ్ పాన్ ఇండియా మూవీ ‘పెద్ది’పై అంచనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, గ్లింప్స్ ప్రేక్షకుల్లో భారీ ఆసక్తిని రేకెత్తించగా.. తాజాగా రామ్ చరణ్ చేసిన వ్యాఖ్యలు సినిమాపై మరింత హైప్‌ను క్రియేట్ చేస్తున్నాయి.
సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా బాలీవుడ్ మీడియాతో మాట్లాడిన రామ్ చరణ్.. ‘పెద్ది’లో తన పాత్ర గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. తన కెరీర్‌లో ఇప్పటివరకు చేసిన పాత్రలన్నింటికంటే ఇది పూర్తిగా భిన్నమైనదని, ఈ క్యారెక్టర్ తనను నటుడిగా కొత్త కోణంలో ఆలోచించేలా చేసిందని చెప్పారు.
‘‘పెద్ది సినిమాలో నేను పోషించిన పాత్ర నా కెరీర్‌లోనే అత్యంత ప్రత్యేకమైనది. ఇలాంటి పాత్రను నేను ఇంతకుముందు ఎప్పుడూ చేయలేదు. ఈ సినిమా ద్వారా నటుడిగా ఎన్నో కొత్త విషయాలు నేర్చుకున్నాను. ముఖ్యంగా అద్భుతమైన నటీనటులతో కలిసి పనిచేయడం గొప్ప అనుభవంగా నిలిచింది’’ అని రామ్ చరణ్ తెలిపారు.
ఇక ఇదే కార్యక్రమంలో పాల్గొన్న సీనియర్ నటుడు బొమన్ ఇరానీ కూడా చరణ్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. ఈ సినిమాలో రామ్ చరణ్ మూడు విభిన్న క్రీడల్లో తన ప్రతిభను చూపించారని, కుస్తీ, క్రికెట్, రన్నింగ్‌తో పాటు నాలుగో ‘ఆట’గా డ్యాన్స్‌లోనూ ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తారని అన్నారు.
అంతేకాదు, ఒక వ్యక్తి తన గుర్తింపు కోసం ఎంత దూరమైనా వెళ్లగలడనే బలమైన భావోద్వేగాన్ని ఈ సినిమా ప్రేక్షకులకు చేరవేస్తుందని బొమన్ ఇరానీ పేర్కొన్నారు. దీంతో ‘పెద్ది’ కేవలం స్పోర్ట్స్ డ్రామా మాత్రమే కాకుండా, ఎమోషన్స్‌తో నిండిన పవర్‌ఫుల్ జర్నీగా ఉండబోతుందనే సంకేతాలు కనిపిస్తున్నాయి.
ఇక ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తుండగా, భారీ స్థాయిలో నిర్మించిన ఈ సినిమాను జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. విడుదల తేదీ దగ్గర పడుతున్న కొద్దీ సినిమా చుట్టూ నెలకొంటున్న హైప్ అభిమానుల్లో మరింత ఉత్సాహాన్ని పెంచుతోంది.









