మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న ‘పెద్ది’ సినిమా విడుదలకు ముందు నెలకొన్న థియేటర్ వివాదానికి ఫుల్ స్టాప్ పడింది. గత కొన్ని రోజులుగా ఎగ్జిబిటర్లు డిమాండ్ చేస్తున్న పర్సంటేజ్ మోడల్‌పై నిర్మాతలు, థియేటర్ యాజమాన్యాల మధ్య ఎట్టకేలకు ఒప్పందం కుదిరింది. దీంతో జూన్ 4న ‘పెద్ది’ సినిమా ఎలాంటి అడ్డంకులు లేకుండా గ్రాండ్‌గా రిలీజ్ అవ్వడానికి మార్గం సుగమమైంది.
తాజా ఒప్పందం ప్రకారం.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ‘పెద్ది’ సినిమాకు టికెట్ ధరలు పెంచితే, ఆ పెరిగిన మొత్తంపై అదనంగా 7.5 శాతం చెల్లించేందుకు నిర్మాతలు అంగీకరించారు. అంతేకాదు ప్రీమియర్ షోల విషయంలో కూడా ప్రత్యేక రేట్లు ఫిక్స్ చేశారు. A సెంటర్లలో ప్రతి షోకు రూ.25 వేల, B సెంటర్లలో రూ.15 వేల, C సెంటర్లలో రూ.10 వేల చొప్పున చెల్లింపులు జరగనున్నాయి.
ఇక ఇండస్ట్రీలో పూర్తిస్థాయి కొత్త పర్సంటేజ్ సిస్టమ్‌ను రాబోయే మూడు వారాల్లోపు లేదా తదుపరి పెద్ద సినిమా రిలీజ్‌కు ముందే అమల్లోకి తీసుకురావాలని నిర్ణయించారు. ఇప్పటికే 70 శాతం పైగా షూటింగ్ పూర్తి చేసుకున్న సినిమాలకు ఈ విధానంలో ప్రత్యేక వెసులుబాటు ఇవ్వనున్నారు.
మొత్తానికి ‘పెద్ది’ రిలీజ్‌పై నెలకొన్న అనుమానాలన్నింటికీ చెక్ పడగా.. ఇప్పుడు అభిమానుల దృష్టంతా ట్రైలర్, ప్రీ రిలీజ్ ఈవెంట్ మరియు బాక్సాఫీస్ రికార్డులపైనే ఉంది.








