Search
Close this search box.

  పర్సంటేజీ పంచాయితీకి మెగాస్టార్ ఫుల్ స్టాప్ పెడతారా..?

May 25, 2026 11:16 PM | Aditya369 News

పర్సంటేజీ పంచాయితీకి మెగాస్టార్ ఫుల్ స్టాప్ పెడతారా..?

తెలుగు చిత్ర పరిశ్రమలో గత కొన్ని రోజులుగా హాట్ టాపిక్‌గా మారిన ‘పర్సంటేజీ విధానం’ వివాదంపై కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ సమస్య కేవలం ఒక సినిమా లేదా ఒక వర్గానికి సంబంధించినది కాదని, మొత్తం పరిశ్రమ భవిష్యత్తుతో ముడిపడి ఉన్న అంశమని తెలంగాణ ఎఫ్‌డీసీ ఛైర్మన్, ప్రముఖ నిర్మాత దిల్ రాజు స్పష్టం చేశారు. ఎగ్జిబిటర్లు, నిర్మాతల మధ్య నెలకొన్న విభేదాలు త్వరలోనే పరిష్కారమవుతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

ఈ నేపథ్యంలో తెలంగాణ ఎగ్జిబిటర్లు, ప్రముఖ నిర్మాతలు కలిసి మెగాస్టార్ చిరంజీవిని ప్రత్యేకంగా కలిశారు. ఈ సమావేశంలో దిల్ రాజుతో పాటు సురేశ్ బాబు, కేఎల్ నారాయణ, అల్లు అరవింద్ తదితరులు పాల్గొన్నారు. దాదాపు గంటపాటు జరిగిన ఈ భేటీలో సింగిల్ స్క్రీన్ థియేటర్ల పరిస్థితులు, పర్సంటేజీ విధానం వల్ల ఎదురవుతున్న ఇబ్బందులు వంటి పలు అంశాలను చిరంజీవి దృష్టికి తీసుకెళ్లారు.

సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన దిల్ రాజు.. ఎగ్జిబిటర్లు తమ సమస్యలను పూర్తి స్థాయిలో చిరంజీవికి వివరించారని, ఆయన కూడా ప్రతి అంశాన్ని ఎంతో సానుకూలంగా విన్నారని తెలిపారు. ఈ విషయంపై ఫిల్మ్ ఛాంబర్ ఏర్పాటు చేసిన కమిటీ నుంచి పూర్తి నివేదిక తెప్పించుకుంటానని చిరంజీవి హామీ ఇచ్చినట్లు చెప్పారు. పరిశ్రమకు అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయం రావాలని మెగాస్టార్ సూచించారని వెల్లడించారు. మరో రెండు రోజుల్లో సమస్యకు పరిష్కారం దొరికే అవకాశాలు ఉన్నాయని దిల్ రాజు పేర్కొన్నారు.

ఇక తెలంగాణ ఎగ్జిబిటర్ల కార్యదర్శి శ్రీధర్ మాట్లాడుతూ.. సింగిల్ స్క్రీన్ థియేటర్ల యజమానులు ఎదుర్కొంటున్న కష్టాలను వివరించగా చిరంజీవి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారని తెలిపారు. “ఇన్ని సమస్యలు ఉన్నాయా?” అంటూ ఆయన ఆశ్చర్యపోయారని చెప్పారు. అలాగే ఈ వ్యవహారంపై ఛాంబర్ కమిటీ సభ్యులతో కూడా మాట్లాడతానని చిరంజీవి హామీ ఇచ్చినట్లు వెల్లడించారు.

ప్రస్తుతం ఈ పర్సంటేజీ విధానం అంశం పరిశ్రమలో పెద్ద చర్చకు దారితీయగా.. చిరంజీవి జోక్యంతో సమస్యకు త్వరలోనే పరిష్కారం దొరకొచ్చనే ఆశలు వ్యక్తమవుతున్నాయి.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore