మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్– స్టార్ డైరెక్టర్ జీతూ జోసెఫ్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ సస్పెన్స్ థ్రిల్లర్ ‘దృశ్యం 3’ విడుదలకు ముందే బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తోంది. మే 21న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమవుతున్న ఈ చిత్రం… అడ్వాన్స్ బుకింగ్స్ రూపంలోనే రూ.15 కోట్లకు పైగా వసూలు చేసి ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరుస్తోంది. ఓవర్సీస్లో ఇప్పటికే 1 మిలియన్ డాలర్ల మార్క్ దాటినట్లు సమాచారం.
ప్రస్తుతం కేరళ బాక్సాఫీస్‌లో ‘ఎంపురాన్’, ‘లియో’ తర్వాత అత్యధిక ఓపెనింగ్స్ సాధించే సినిమాగా ‘దృశ్యం 3’ నిలవబోతుందనే టాక్ వినిపిస్తోంది. ఇప్పటివరకు కేరళలో ‘ఎంపురాన్’ రూ.14 కోట్లు, ‘లియో’ రూ.12 కోట్ల ఫస్ట్ డే కలెక్షన్స్ సాధించగా… ఇప్పుడు ‘దృశ్యం 3’ కూడా తొలి రోజే రూ.10 కోట్ల క్లబ్‌లోకి ఎంట్రీ ఇవ్వడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. కేవలం కేరళ అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారానే రూ.5 కోట్లకు పైగా రాబట్టిందట.
ఇక ఈసారి ‘దృశ్యం 3’ను మలయాళ సినీ చరిత్రలోనే అత్యంత భారీ స్థాయిలో విడుదల చేస్తున్నారు. గత రెండు పార్ట్స్‌లో నటించిన మీనా, అన్సిబా, ఎస్తేర్ అనిల్ ఈ పార్ట్‌లోనూ కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. ముఖ్యంగా గత ఆరేళ్లలో జార్జ్‌కుట్టి కుటుంబ జీవితంలో జరిగిన మార్పులు, కొత్త మిస్టరీలు ఈ కథలో ప్రధాన హైలైట్‌గా ఉండబోతున్నాయని తెలుస్తోంది.
తెలుగు రాష్ట్రాల్లో ప్రమోషన్స్ పెద్దగా లేకపోవడంతో ఇక్కడ బజ్ కాస్త తక్కువగా కనిపిస్తున్నా… మలయాళ మార్కెట్లో మాత్రం ‘దృశ్యం 3’పై అంచనాలు పీక్స్‌లో ఉన్నాయి. ప్రస్తుత ట్రెండ్ చూస్తుంటే… ఈ సినిమా మొదటి రోజే భారీ ఓపెనింగ్స్ సాధించి కేరళ బాక్సాఫీస్ వద్ద కొత్త రికార్డులు సృష్టించే దిశగా దూసుకుపోతోందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.








