టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి ఇటీవల మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ తో రూపొందించిన లక్కీ భాస్కర్ సినిమాతో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ సినిమా సక్సెస్ కావడంతో , వెంకీ ఇప్పుడు తన నెక్స్ట సినిమా కోలీవుడ్ సూపర్‌స్టార్ సూర్యతో చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించాడు… ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కొనసాగుతుంది.. ఇది సూర్య కెరీర్లో సినిమాగా తెరకెక్కుతోంది.. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ షూటింగ్ వేగంగా జరగుతుండగా, సినిమాకు సంబంధించిన తాజా బజ్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.. ప్రస్తుతం ఈ సినిమా సూర్య 46 అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతుంది..ఐతే ఈ సినిమా ఓ క్రేజీ టైటిల్ ను డైరెక్టర్ ఫిక్స్ చేసినట్లు సమాచారం.. ఇప్పుడు ఈ న్యూస్ హాట్ టాపిక్ గా మారింది.. ఇప్పటికే వెంకీ తన టైటిల్స్ తోనే ఆడియెన్స్ ను అట్రాక్ట్ చేస్తున్నాడు.. అందుతున్న సమాచారం ప్రకారం, ఈ సినిమాకి “విశ్వనాథన్ అండ్ సన్స్” అనే ఇంట్రెస్టింగ్ టైటిల్‌ను ఫైనల్ చేయాలని మేకర్స్ పరిశీలిస్తున్నారు. కథకు బాగా సరిపడేలా ఉండటంతో, ఈ టైటిల్‌నే లాక్ చేసే అవకాశం ఉందని టాక్. ఈ టైటిల్ నెట్టింట్లో వైరల్ అవుతూ, ఫ్యాన్స్‌తో పాటు ఇండస్ట్రీ వర్గాల దృష్టిని కూడా ఆకర్షిస్తోంది..ఈ సినిమాలో మమిత బైజు హీరోయిన్గా నటిస్తుండగా, సంగీతం జీవీ ప్రకాష్ కుమార్ అందిస్తున్నాడు.. .ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై నాగ వంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు..వెంకీ అట్లూరి – సూర్య కాంబినేషన్, ఈ ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అధికారిక టైటిల్ అనౌన్స్మెంట్ త్వరలోనే వెలువడే అవకాశం ఉంది…









