మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం ‘పెద్ది’ సినిమాతో తన కెరీర్లోనే మరో భారీ కంబ్యాక్‌ను నమోదు చేసిన సంగతి తెలిసిందే. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా సృష్టించిన ప్రభంజనం తర్వాత ఇప్పుడు అభిమానుల దృష్టంతా ఆయన తదుపరి ప్రాజెక్ట్‌పైనే పడింది. ముఖ్యంగా రామ్ చరణ్ తన కెరీర్ 17వ చిత్రాన్ని స్టార్ డైరెక్టర్ సుకుమార్‌తో చేయబోతుండటంతో ఈ క్రేజీ కాంబినేషన్‌పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.
ఇప్పటికే ‘రంగస్థలం’ వంటి ఇండస్ట్రీ హిట్‌ను అందించిన ఈ సూపర్ హిట్ కాంబో మరోసారి చేతులు కలపనుండటం అభిమానుల్లో విపరీతమైన ఆసక్తిని పెంచుతోంది. ‘రంగస్థలం’లో చిట్టిబాబు పాత్రతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసిన రామ్ చరణ్, ఈసారి సుకుమార్‌తో ఎలాంటి మ్యాజిక్ క్రియేట్ చేస్తాడో అనే చర్చలు సోషల్ మీడియాలో జోరుగా సాగుతున్నాయి.
అయితే ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్న విషయం మాత్రం రామ్ చరణ్ లుక్. ‘పెద్ది’ సినిమా కోసం ప్రత్యేకంగా పెంచుకున్న లాంగ్ హెయిర్ లుక్‌లోనే ఆయన ఇప్పటికీ కనిపిస్తున్నారు. సాధారణంగా స్టార్ హీరోలు ఒక సినిమా పూర్తయ్యాక ఆ చిత్రానికి సంబంధించిన లుక్‌ను వెంటనే మార్చేస్తుంటారు. ముఖ్యంగా కొత్త ప్రాజెక్ట్ కోసం సరికొత్త మేకోవర్‌తో అభిమానులకు సర్ప్రైజ్ ఇస్తుంటారు.
కానీ ‘పెద్ది’ షూటింగ్ పూర్తై, సినిమా విడుదలైన తర్వాత కూడా రామ్ చరణ్ అదే లాంగ్ హెయిర్ స్టైల్‌ను కొనసాగించడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. దీంతో సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కబోయే RC17లో కూడా ఇదే లుక్‌లో కనిపించబోతున్నాడా? లేక అభిమానులను ఆశ్చర్యపరిచేలా మరో కొత్త మేకోవర్ సిద్ధం చేస్తున్నాడా? అనే చర్చలు మొదలయ్యాయి.
మరి ‘రంగస్థలం’ కాంబో మరోసారి బాక్సాఫీస్‌ను షేక్ చేయడానికి సిద్ధమవుతుండగా… రామ్ చరణ్ తన లుక్ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో చూడాలి. దీనిపై అధికారిక క్లారిటీ వచ్చే వరకు అభిమానుల్లో ఈ సస్పెన్స్ మాత్రం కొనసాగనుంది.








