Search
Close this search box.

  ‘అప్పలసూరి’ నా కెరీర్ బెస్ట్ రోల్..! రోల్ పై జగ్గుభాయి కామెంట్స్ వైరల్..!

May 29, 2026 7:54 AM | Aditya369 News

‘అప్పలసూరి’ నా కెరీర్ బెస్ట్ రోల్..! రోల్ పై జగ్గుభాయి కామెంట్స్ వైరల్..!

టాలీవుడ్‌లో విలక్షణమైన పాత్రలతో తన సెకండ్ ఇన్నింగ్స్‌ను సక్సెస్‌ఫుల్‌గా కొనసాగిస్తున్న సీనియర్ నటుడు జగపతి బాబు.. ఇప్పుడు మరో పవర్‌ఫుల్ పాత్రతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ హీరోగా దర్శకుడు బుచ్చిబాబు సన తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం ‘పెద్ది’లో జగపతి బాబు పోషిస్తున్న ‘అప్పలసూరి’ పాత్రపై ప్రస్తుతం భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న జగ్గుభాయ్.. ఈ పాత్ర గురించి ఎన్నో ఆసక్తికర విషయాలను బయటపెట్టారు.

గుర్తుపట్టలేని లుక్‌లో జగపతి బాబు!

‘పెద్ది’ సినిమాలో తన లుక్ పూర్తిగా డిఫరెంట్‌గా ఉండబోతుందని జగపతి బాబు తెలిపారు. నేషనల్ అవార్డ్ విన్నర్ రషీద్ ఈ పాత్రకు మేకప్ డిజైన్ చేశారని, మొదటిసారి మేకప్ వేసుకుని అద్దంలో చూసుకున్నప్పుడు తానే ఆశ్చర్యపోయానన్నారు. “అప్పలసూరి పాత్రలోకి పూర్తిగా మారిపోయాను. స్క్రీన్‌పై చూస్తే ఇది జగపతి బాబేనా అని ప్రేక్షకులు షాక్ అవుతారు” అంటూ ఆయన చెప్పుకొచ్చారు.

ఈ లుక్ కేవలం గ్లామర్ కోసం కాకుండా.. కథలో పాత్రకు ఉండే బలం, ఎమోషన్‌ను చూపించడానికి ప్రత్యేకంగా డిజైన్ చేశారని తెలిపారు.

ఇది విలన్ పాత్ర కాదు!

చాలామంది అనుకుంటున్నట్లు ‘అప్పలసూరి’ నెగిటివ్ రోల్ కాదని జగపతి బాబు స్పష్టం చేశారు. “ఇది చాలా డీప్ ఎమోషన్స్‌తో కూడిన పాత్ర. ఒక బలమైన లక్ష్యం కోసం బ్రతికే వ్యక్తి. సినిమా మొత్తానికి ఈ పాత్ర ఓ పెద్ద పిల్లర్‌లా ఉంటుంది” అని అన్నారు.

అంతేకాదు.. తన కెరీర్‌లో చేసిన బెస్ట్ పాత్రల్లో ఇదొకటిగా నిలుస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. “లెజెండ్, శ్రీమంతుడు, నాన్నకు ప్రేమతో, రంగస్థలం, అరవింద సమేత వంటి సినిమాల్లో చేసిన పాత్రల సరసన ‘అప్పలసూరి’ కూడా నిలుస్తుంది. బహుశా వాటన్నింటికంటే ఎక్కువ గుర్తింపు తెచ్చిపెట్టొచ్చు” అని చెప్పారు.

రామ్‌చరణ్‌తో ఎమోషనల్ బాండింగ్

ఈ సినిమాలో రామ్‌చరణ్‌తో తన కెమిస్ట్రీ చాలా ప్రత్యేకంగా ఉంటుందని జగపతి బాబు తెలిపారు. వయసులో పెద్దవాడైనా.. చరణ్‌ను ‘ఒరేయ్ అరేయ్’ అని పిలిచేంత చనువు ఈ పాత్రకు ఉంటుందన్నారు.

ఇద్దరూ కలిసి బీడీలు కాల్చుకునే సీన్స్, వారి మధ్య వచ్చే ఎమోషనల్ మూమెంట్స్ థియేటర్లలో ప్రేక్షకులను బాగా కనెక్ట్ చేస్తాయని చెప్పారు. ‘రంగస్థలం’లో చరణ్‌తో కలిసి నటించినా.. ఈ సినిమాలో కనిపించే బాండింగ్ మాత్రం పూర్తిగా కొత్తగా ఉంటుందని తెలిపారు.

డబ్బింగ్ కోసం 11 రోజుల బెడ్ రెస్ట్!

‘పెద్ది’ కోసం డబ్బింగ్ చెప్పడం తన కెరీర్‌లోనే అతిపెద్ద ఛాలెంజ్‌గా మారిందని జగపతి బాబు వెల్లడించారు. విజయనగరం యాసలో పర్ఫెక్ట్‌గా డైలాగ్స్ చెప్పడం కోసం చాలా కష్టపడ్డానన్నారు.

సాధారణంగా ఒకటి లేదా రెండు రోజుల్లో డబ్బింగ్ పూర్తి చేసే తాను.. ఈ సినిమాకు మాత్రం రోజుకు రెండు మూడు లైన్లు మాత్రమే చెప్పగలిగానని తెలిపారు. పర్ఫెక్షన్ కోసం గొంతు చించుకుని డబ్బింగ్ చెప్పడం వల్ల మెడ, తల నరాలు బాగా బిగుసుకుపోయాయని.. దాంతో ఏకంగా 11 రోజుల పాటు బెడ్ రెస్ట్ తీసుకోవాల్సి వచ్చిందని చెప్పారు.

ప్రస్తుతం ఇండస్ట్రీకి ‘పెద్ది’లాంటి సినిమా చాలా అవసరమని, ఈ చిత్రం ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇస్తుందని జగపతి బాబు ఆశాభావం వ్యక్తం చేశారు. ఇక అప్పలసూరిగా జగ్గుభాయ్ విశ్వరూపం ఎలా ఉండబోతుందో చూడాలని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు