బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్, టాలీవుడ్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి కాంబినేషన్లో అనౌన్స్ అయిన కొత్త చిత్రం ఇప్పటికే మంచి హైప్ క్రియేట్ చేసింది. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌పై తాజాగా మరో ఆసక్తికరమైన అప్డేట్ బయటకు వచ్చింది.
సమాచారం ప్రకారం, ఈ సినిమా షూటింగ్ మొదటి షెడ్యూల్‌ను ఏప్రిల్ 18 నుంచి మే 4 వరకు ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. ఇందుకోసం ప్రత్యేకంగా ఓ భారీ ఇంటి సెట్‌ను కూడా మేకర్స్ సిద్ధం చేసినట్టు టాక్ వినిపిస్తోంది.
ఇంకా ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఈ మొదటి షెడ్యూల్లోనే సల్మాన్ ఖాన్‌పై ఒక వింటేజ్ స్టైల్ సాంగ్‌ను దర్శకుడు వంశీ పైడిపల్లి ప్లాన్ చేస్తున్నారట. ఈ సాంగ్ సినిమాకే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని చెబుతున్నారు.
ఇక ఈ చిత్రంలో హీరోయిన్గా నయనతార నటిస్తుండగా, ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నారు.
మొత్తానికి, ఈ క్రేజీ కాంబినేషన్ మూవీని వంశీ పైడిపల్లి తనదైన స్టైల్లో ఎలా తీర్చిదిద్దుతాడో చూడాలని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు!








