Search
Close this search box.

  ప్రభాస్ ఫ్యాన్స్‌కు షాక్.. ‘ఫౌజీ’ రిలీజ్ మరోసారి వాయిదా..?

June 16, 2026 8:27 AM | Aditya369 News

ప్రభాస్ ఫ్యాన్స్‌కు షాక్.. ‘ఫౌజీ’ రిలీజ్ మరోసారి వాయిదా..?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఇటీవల సంక్రాంతి కానుకగా విడుదలైన 'రాజాసాబ్' సినిమాతో అభిమానులను పూర్తిస్థాయిలో మెప్పించలేకపోయాడు. దీంతో ఇప్పుడు డార్లింగ్ ఫ్యాన్స్ దృష్టి మొత్తం ఆయన నెక్స్ట్ ప్రాజెక్ట్స్‌పైనే పడింది. ప్రభాస్ చేతిలో ప్రస్తుతం భారీ సినిమాల లైనప్ ఉన్నప్పటికీ.. వాటిలో అన్నిటికంటే ముందుగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రం 'ఫౌజీ' అనే వార్తలు ఆసక్తిని పెంచుతున్నాయి.

మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో, సెన్సిటివ్ డైరెక్టర్ హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ప్రేమ, యుద్ధం నేపథ్యంలో సాగే పీరియాడిక్ డ్రామాగా రూపొందుతోంది. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ముఖ్యంగా ఈ సినిమాలో ప్రభాస్ ఓ ఆర్మీ అధికారిగా కనిపించబోతున్నాడనే ప్రచారం అభిమానుల్లో మరింత క్యూరియాసిటీని పెంచుతోంది.

మొదట ఈ సినిమాను స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15న విడుదల చేయాలని మేకర్స్ భావించారని వార్తలు వచ్చాయి. ఆ తర్వాత దసరా బరిలోకి తీసుకురావాలని కూడా ప్లాన్ చేసినట్లు టాక్ వినిపించింది. కానీ ఇప్పటి వరకు అధికారిక రిలీజ్ డేట్ ప్రకటించకపోవడంతో అభిమానుల్లో అనుమానాలు మొదలయ్యాయి.

తాజా టాలీవుడ్ వర్గాల సమాచారం ప్రకారం.. 'ఫౌజీ' విడుదల మరోసారి వాయిదా పడే అవకాశం ఉందట. ఇంకా షూటింగ్ పూర్తికాకపోవడం, పోస్ట్ ప్రొడక్షన్ పనులకు ఎక్కువ సమయం అవసరం కావడంతో మేకర్స్ తొందరపడకుండా బెస్ట్ అవుట్‌పుట్ కోసం సమయం తీసుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

దీంతో ఈ చిత్రాన్ని క్రిస్మస్ – న్యూ ఇయర్ హాలిడే సీజన్‌ను టార్గెట్ చేస్తూ డిసెంబర్‌లో విడుదల చేసే అవకాశాలు ఉన్నాయని ఇండస్ట్రీలో బలంగా వినిపిస్తోంది.

అయితే ప్రభాస్ అభిమానులకు ఓ గుడ్ న్యూస్ కూడా ఉంది. వచ్చే నెల జూలైలో 'ఫౌజీ' టీజర్‌ను విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఈ టీజర్‌తో సినిమాపై ఉన్న సస్పెన్స్‌కు తెరపడే అవకాశం ఉంది.

మరి హను రాఘవపూడి – ప్రభాస్ కాంబినేషన్ ఎలాంటి మ్యాజిక్ చేయబోతోంది? 'ఫౌజీ' ప్రభాస్‌కు మరో బ్లాక్‌బస్టర్ హిట్‌ను అందిస్తుందా? అన్నది చూడాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఇటీవల సంక్రాంతి కానుకగా విడుదలైన ‘రాజాసాబ్’ సినిమాతో అభిమానులను పూర్తిస్థాయిలో మెప్పించలేకపోయాడు. దీంతో ఇప్పుడు డార్లింగ్ ఫ్యాన్స్ దృష్టి మొత్తం ఆయన నెక్స్ట్ ప్రాజెక్ట్స్‌పైనే పడింది. ప్రభాస్ చేతిలో ప్రస్తుతం భారీ సినిమాల లైనప్ ఉన్నప్పటికీ.. వాటిలో అన్నిటికంటే ముందుగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రం ‘ఫౌజీ’ అనే వార్తలు ఆసక్తిని పెంచుతున్నాయి.

మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో, సెన్సిటివ్ డైరెక్టర్ హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ప్రేమ, యుద్ధం నేపథ్యంలో సాగే పీరియాడిక్ డ్రామాగా రూపొందుతోంది. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ముఖ్యంగా ఈ సినిమాలో ప్రభాస్ ఓ ఆర్మీ అధికారిగా కనిపించబోతున్నాడనే ప్రచారం అభిమానుల్లో మరింత క్యూరియాసిటీని పెంచుతోంది.

మొదట ఈ సినిమాను స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15న విడుదల చేయాలని మేకర్స్ భావించారని వార్తలు వచ్చాయి. ఆ తర్వాత దసరా బరిలోకి తీసుకురావాలని కూడా ప్లాన్ చేసినట్లు టాక్ వినిపించింది. కానీ ఇప్పటి వరకు అధికారిక రిలీజ్ డేట్ ప్రకటించకపోవడంతో అభిమానుల్లో అనుమానాలు మొదలయ్యాయి.

తాజా టాలీవుడ్ వర్గాల సమాచారం ప్రకారం.. ‘ఫౌజీ’ విడుదల మరోసారి వాయిదా పడే అవకాశం ఉందట. ఇంకా షూటింగ్ పూర్తికాకపోవడం, పోస్ట్ ప్రొడక్షన్ పనులకు ఎక్కువ సమయం అవసరం కావడంతో మేకర్స్ తొందరపడకుండా బెస్ట్ అవుట్‌పుట్ కోసం సమయం తీసుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

దీంతో ఈ చిత్రాన్ని క్రిస్మస్ – న్యూ ఇయర్ హాలిడే సీజన్‌ను టార్గెట్ చేస్తూ డిసెంబర్‌లో విడుదల చేసే అవకాశాలు ఉన్నాయని ఇండస్ట్రీలో బలంగా వినిపిస్తోంది.

అయితే ప్రభాస్ అభిమానులకు ఓ గుడ్ న్యూస్ కూడా ఉంది. వచ్చే నెల జూలైలో ‘ఫౌజీ’ టీజర్‌ను విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఈ టీజర్‌తో సినిమాపై ఉన్న సస్పెన్స్‌కు తెరపడే అవకాశం ఉంది.

మరి హను రాఘవపూడి – ప్రభాస్ కాంబినేషన్ ఎలాంటి మ్యాజిక్ చేయబోతోంది? ‘ఫౌజీ’ ప్రభాస్‌కు మరో బ్లాక్‌బస్టర్ హిట్‌ను అందిస్తుందా? అన్నది చూడాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు