మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన రాబోయే చిత్రం పెద్ది కోసం పూర్తిగా కొత్త అవతారంలో కనిపించేందుకు భారీగా శ్రమిస్తున్నారు. క్రియేటివ్ డైరెక్టర్ బుచ్చి బాబు తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో చరణ్ ఒకే పాత్రలో మూడు విభిన్న గెటప్‌లలో కనిపించనున్నారని సమాచారం. జూన్‌లో రిలీజ్‌కు సిద్ధమవుతున్న ఈ మూవీపై ఇప్పటికే భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
16 నెలల కష్టానికి ఫలితం…
గత 16 నెలలుగా చరణ్‌కు ట్రైనింగ్ ఇస్తున్న సెలబ్రిటీ ఫిట్నెస్ ట్రైనర్ రక్కేష్ ఉద్దియార్, ఈ ట్రాన్స్ఫర్మేషన్ వెనుక ఉన్న కష్టం గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. దర్శకుడు బుచ్చిబాబు, చరణ్ కలిసి పాత్ర లుక్‌పై క్లారిటీతో ఉన్నారని, ఈ సినిమాలో ఆయన ‘గ్రీక్ గాడ్’లా కాకుండా సహజమైన ‘దేశీ పహిల్వాన్’లా కనిపించాలనుకున్నారని తెలిపారు.
ట్రెడిషనల్ ట్రైనింగ్‌తో ట్రాన్స్ఫర్మేషన్
ఈ లుక్ కోసం ట్రైనింగ్‌ను పూర్తిగా ప్లాన్ చేశారు. వారంలో మూడు రోజులు కార్డియో, వెయిట్ ట్రైనింగ్ చేస్తూ, మిగతా రోజుల్లో ఫంక్షనల్ వర్కౌట్స్, కుస్తీ వ్యాయామాలు, మొబిలిటీ డ్రిల్స్ చేయించారు. అదనంగా గదతో శిక్షణ, సూర్య నమస్కారాలు, తాడు లాగడం వంటి సంప్రదాయ వ్యాయామాలు కూడా ఈ ట్రైనింగ్‌లో భాగమయ్యాయి.
డైట్లో కఠిన నియమాలు
ఆహారం విషయంలో కూడా చరణ్ కఠినమైన డిసిప్లిన్ పాటించారు. ‘కార్బ్ సైక్లింగ్’ పద్ధతిలో రోజుకు 1,800 నుంచి 2,500 క్యాలరీల మధ్య డైట్ ప్లాన్ ఫాలో అయ్యారు. కొన్ని రోజులు తక్కువ కార్బ్స్, కొన్ని రోజులు ఎక్కువ కార్బ్స్ తీసుకుంటూ శరీరాన్ని బ్యాలెన్స్‌లో ఉంచారు. మొదట్లో సన్నగా కనిపించే పాత్ర కోసం దాదాపు 4-5 నెలలు క్యాలరీ డెఫిసిట్‌లో ఉంచి బరువు తగ్గించినట్లు ట్రైనర్ తెలిపారు.
ఉదయం 4 గంటల నుంచే కష్టపడ్డ చరణ్
క్రమశిక్షణ విషయంలో చరణ్ అంకితభావం అద్భుతమని ట్రైనర్ వెల్లడించారు. ప్రతి రోజు ఉదయం 4 గంటలకే ట్రైనింగ్ ప్రారంభించి, షూటింగ్‌కు వెళ్లే ముందు వర్కౌట్ పూర్తి చేసేవారని చెప్పారు. మొదటి మీల్ కూడా షూటింగ్‌కు వెళ్తూ కారులోనే తీసుకునేవారని పేర్కొన్నారు.
పూర్తి టీమ్ సమన్వయం… భారీ సర్ప్రైజ్
ఈ ట్రాన్స్ఫర్మేషన్ కోసం చెఫ్, డాక్టర్, డైటీషియన్, పర్సనల్ టీమ్ అందరూ కలిసి పనిచేశారు. అందరి మధ్య సమన్వయం కోసం ప్రత్యేకంగా ఒక గ్రూప్ ఏర్పాటు చేసి, చరణ్ డైట్ మరియు హెల్త్‌పై నిరంతరం పర్యవేక్షణ చేసినట్లు తెలిపారు.
దాదాపు ఏడాది నాలుగు నెలల పాటు సాగిన ఈ కష్టానికి ఫలితంగా చరణ్ లుక్స్ ప్రేక్షకులకు పెద్ద సర్ప్రైజ్ కానున్నాయి. ముఖ్యంగా సినిమాలో మూడో గెటప్ అభిమానులను ఖచ్చితంగా ఆశ్చర్యపరుస్తుందని ట్రైనర్ వెల్లడించారు.








