Search
Close this search box.

  నాని కెరీర్‌లోనే బిగ్గెస్ట్ యాక్షన్ ఎపిసోడ్..! ‘బ్లడీ రోమియో’ క్రేజీ అప్‌డేట్..!

June 29, 2026 9:59 AM | Aditya369 News

నాని కెరీర్‌లోనే బిగ్గెస్ట్ యాక్షన్ ఎపిసోడ్..! ‘బ్లడీ రోమియో’ క్రేజీ అప్‌డేట్..!

న్యాచురల్ స్టార్ నాని – స్టార్ డైరెక్టర్ సుజీత్ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న స్టైలిష్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘బ్లడీ రోమియో’ గురించి మరో క్రేజీ అప్‌డేట్ బయటకు వచ్చింది.

ప్రస్తుతం ఈ సినిమా ప్రీ-ప్రొడక్షన్ పనులు చివరి దశలో ఉండగా… కథలోని ఓ కీలక యాక్షన్ ఎపిసోడ్‌పై ఇండస్ట్రీలో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది.

సమాచారం ప్రకారం… సినిమా ఇంటర్వెల్‌లో వచ్చే హై-వోల్టేజ్ ఫైట్‌ను సుజీత్ నెక్స్ట్ లెవల్‌లో ప్లాన్ చేశారట. ముఖ్యంగా ఆకాశంలో దూసుకెళ్తున్న విమానంలో జరిగే ఈ యాక్షన్ సీక్వెన్స్ విజువల్‌గా అద్భుతంగా ఉండబోతుందని టాక్. అంతేకాదు… సినిమాలో వచ్చే అతిపెద్ద ట్విస్ట్‌కు ఇదే లీడ్‌గా నిలుస్తుందని, మొత్తం చిత్రంలో ఈ ఎపిసోడ్ ప్రధాన హైలైట్‌గా మారనుందని సమాచారం.

ఇక ఈ చిత్రంలో ఎక్కువ భాగం షూటింగ్‌ను లండన్‌లో నిర్వహించనున్నారు. ఇప్పటికే సుజీత్ అండ్ టీమ్ కీలక లొకేషన్లను ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం నాని ‘ది ప్యారడైజ్’ చిత్రీకరణలో బిజీగా ఉండగా… ఆ సినిమా విడుదలైన వెంటనే ‘బ్లడీ రోమియో’ సెట్స్‌పైకి వెళ్లనుంది. ఈ ఏడాది దసరా తర్వాత రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించి… 2027 సమ్మర్ కానుకగా సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్న ఈ భారీ యాక్షన్ డ్రామాలో మాలీవుడ్ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలో నటిస్తుండటంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. మరి నాని – సుజీత్ కాంబినేషన్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో చూడాలి.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు